అల్లు అరవింద్ ఎంతో తెలివిగా నందమూరి నటసింహాన్ని తన కాంపౌండ్ లో కట్టిపడేసాడు. బాలయ్య కూడా తనకి రెండిళ్ళు అంటూ చెప్పుకునే లెవల్ కి ఆహా ని ప్రమోట్ చేస్తున్నారు. ఒకటి వసుంధర పిల్లలతో జూబ్లీహిల్స్ లోని ఇల్లయితే మరొకటి ఆహా అన్ స్టాపబుల్ షో అంటూ చమత్కరిస్తున్నారు. ఏదైతేనేమి సీజన్ వన్ గ్రాండ్ సక్సెస్ అవడంతో సీజన్ టు ని చాలా గ్రాండ్ గా చంద్రబాబు నాయుడితో మొదలు పెట్టారు. అబ్బో బాలకృష్ణ-చంద్రబాబు నాయుడు తో షో అంటే భారీ లెవల్ క్రేజ్, అంచనాలు ఉంటాయి కాదు ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూసారు. ఇంకేంటి ఆహా నెట్ వర్క్ షేక్ ఇయ్యేలా ఆహా కి సబ్ స్క్రైబర్స్ పెరిగిపోతారు, ఫస్ట్ ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ అన్నారు. అన్నట్టుగానే బాలకృష్ణ-చంద్రబాబు ఎపిసోడ్ ని చూసేందుకు పోటీ పడ్డారు. అయితే ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ లో ఎక్కువగా రాజకీయాల మీదే ఫోకస్ పెట్టినట్టుగా కనిపించింది.
మధ్యలో ఫ్యామిలీ విషయాలు తీసినా.. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ తక్కువైందనే అభిప్రాయాలు మొదలయ్యాయి. సెలబ్రిటీస్ తో ఆట, మాట మంతి అంటూ హడావిడి చేసే బాలయ్య ఈ ఎపిసోడ్ లో అంతగా ఏంటెర్టైన్ చెయ్యలేకపోయారంటున్నారు. మధ్యలో కూతురు బ్రాహ్మణి, అక్క భువనేశ్వరితో మట్లాడినా అంతా ప్రొఫెషనల్ గానే అనిపించింది కానీ, మజా రాలేదు అంటున్నారు. నందమూరి అభిమానులకి, టిడిపి తమ్ముళ్ళకి, అభిమానులకి ఈ ఎపిసోడ్ కిక్ ఇస్తే.. మిగతా వారు చప్పగా ఉందని తేల్చేసారు.