Advertisement
Google Ads BL

రాజశేఖర్ ఎపిసోడ్ పై చిరు షాకింగ్ కామెంట్స్


మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో భాగంగా అటు పొలిటికల్ గా, ఇటు తనని విమర్శించే వాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేసారు. రీసెంట్ గా చిరంజీవి ఫోటో సెషన్ చేస్తున్నారంటూ గరికపాటి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపటం కాదు, మెగా ఫాన్స్, అలాగే చిరు ని అన్నయ్యలా భావించే ప్రతి ఒక్కరూ గరికపాటిని కడిగిపారేశారు. కానీ మెగాస్టార్ చిరు మాత్రం ఈ విషయమై చాలా హుందాగా స్పందించారు. తప్పు చెయ్యం, చేస్తే తప్పని ఒప్పుకుని సరిదిద్దుకుంటాము, నా అభిమానులు తప్పు చేసినా ఇంటికి వెళ్లి మాట్లాడతాను, నన్ను ఎద్దేవా చేసినవారు నా దగ్గరకి వస్తే ఆలింగనం చేసుకున్నాను, అందుకే ఎక్కువమంది మనసులు గెలుచుకున్నాను, నీ తప్పు లేకుండా నీపై ఆరోపణలు చేస్తే వెంటనే ఢీ కొట్టాల్సిన అవసరం లేదు, నిజం నిలకడపై తెలుస్తుంది అని చెప్పిన మెగాస్టార్ గతంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తనపై వచ్చిన విమర్శలపై స్పందించారు.

Advertisement
CJ Advs

గతంలో నేను పాలిటిక్స్ లోకి వెళ్తాను అనగానే నాపై కామెంట్స్ చేసిన ఒకతని కారుపై నా అభిమానులు రాళ్లు విసిరితే.. నేను ఉదయమే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అంటే నా ఫాన్స్ తప్పు చేసినా నేనే వాళ్ళ ఇంటికి వెళతాను అంటూ గతంలో చిరు పై రాజశేఖర్, జీవితలు తనని కామెంట్ చేసారని తెలిసి, చిరు అభిమానులు రాజశేఖర్ కారుపై రాళ్లు విసిరారు. నా తప్పు లేదు, అయినా దానిని నేను సహించను, ఫాన్స్ చేసిన తప్పుకి  చిరు వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. అంతేకాకుండా సంయమనం పాటించడం కూడా ముఖ్యం, ఒక అడుగు వెనక్కి తగ్గితే తప్పు కాదు, అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై కూడా ఆరోపణలు చేసారు, భూ కబ్జా చేశా అన్నారు అయినా నేను స్పందించలేదు, అసలు నా తప్పు లేనప్పుడు నేనేందుకు ఉలిక్కిపడాలి అంటూ మెగాస్టార్ అప్పట్లో జరిగిన జీవిత-రాజశేఖర్ ఎపిసోడ్ పై ఇప్పుడు స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.

Megastar comments on Jeevitha Rajasekhar episode:

Chiranjeevi Responds React Garikapati Comments
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs