ఇప్పుడు సీనియర్ హీరోల మధ్యన టఫ్ ఫైట్ తప్పేలా కనిపించడం లేదు. ‘అఖండ’తో అఖండమైన విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. గోపీచంద్ మలినేనితో బాలయ్య NBK107 చేస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్‌లో రిలీజ్ అన్నప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోపక్క ‘గాడ్‌ఫాదర్’తో బ్రహ్మాండమైన హిట్ కొట్టి జోష్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన మెగా 154ని కూడా సంక్రాంతి రిలీజ్‌కి రెడీ చేసేస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లని బాబీ చకచకా పూర్తి చేస్తున్నాడు. మెగా 154 జోరు ఎలా ఉంది అంటే.. అప్పుడే పోస్ట్ ప్రొడక్షన్‌లో భాగంగా డబ్బింగ్‌కి వెళ్లిపోయారు. ఈ రోజు నుండే మెగా 154 డబ్బింగ్ సెషన్ స్టార్ట్ అయినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అంతేకాకుండా దివాళికి మెగా 154 నుండి మెగా ఫాన్స్ కి రెండు ట్రీట్స్ రాబోతున్నాయి. అందులో ఒకటి టైటిల్, రెండోది గ్లింప్స్. ఇక నందమూరి నటసింహం నుండి అన్ స్టాపబుల్ అంటూ ఈరోజు చంద్రబాబు-బాలయ్య ఆహా టాక్ షో ఎపిసోడ్ రిలీజ్ చేశారు. అలాగే దివాళికి గోపీచంద్ మలినేని NBK107 టైటిల్ రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి నందమూరి-మెగా ఫాన్స్ ఇద్దరూ ఈ ఇద్దరి హీరోల సినిమాల అప్‌డేట్‌తో సోషల్ మీడియాలో చేసే హంగామా మాములుగా ఉండదు. మరోపక్క చిరు-బాలయ్య అప్‌డేట్స్‌తో నువ్వా-నేనా అని పోటీ పడుతున్నట్లే కనిపిస్తుంది. అప్‌డేట్స్ దగ్గర నుండి రిలీజ్ వరకు చిరు vs బాలయ్య అన్న రేంజ్‌లో ఫైటింగ్ కూడా షురూ అవ్వబోతుంది.