Advertisement
Google Ads BL

RC15పై జానీ మాస్టర్ సూపర్ అప్‌డేట్


రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 చేస్తున్నారు. రీసెంట్ గానే రాజమండ్రి వెళ్లారు చరణ్. అక్కడ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చరణ్- అంజలిపై ఫ్లాష్ బ్యాక్ స్టోరీని శంకర్ చిత్రీకరిస్తున్నారు. ఈ విషయం లీకయిన రామ్ చరణ్- అంజలి ఫోటో ఫ్రేమ్స్ చూస్తుంటే తెలిసిపోతోంది. రామ్ చరణ్ ఓల్డ్ లుక్‌లో కనిపిస్తుండగా.. అంజలి కూడా నార్మల్‌గా శారీ లుక్‌లో కనిపిస్తుంది. అయితే తాజాగా RC15పై కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. RC15లో ఓ సాంగ్‌లో చరణ్ డాన్స్ అదిరిపోతోందని, ఆ సాంగ్ తానే కంపోజ్ చేశానని చెప్పాడు.

Advertisement
CJ Advs

 

ఇంతవరకూ రామ్ చరణ్ చేసిన డాన్సులన్నీ ఒక ఎత్తు, RC15లో తాను కంపోజ్ చేసిన డాన్స్ ఒక ఎత్తు అంటూ చెప్పడంతో మెగా ఫాన్స్ ఊగిపోతున్నారు. మరోపక్క సూపర్ ఫామ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా అదే మాట చెబుతుండటం విశేషం. థమన్ మొదటి నుండి చరణ్ డాన్స్‌లు ఈ సినిమాకి ప్రత్యేకంగా నిలవబోతున్నాయని చెబుతున్నాడు. ఈ చిత్రంలో చరణ్‌కి జోడీగా గ్లామర్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. మరి శంకర్ సినిమాలో సాంగ్ అంటే నిజంగా అవి ప్రత్యేకమైన హంగులతో ఆకర్షణగా నిలుస్తాయి. అందుకే ఈ సాంగ్స్ గురించిన ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది.

RC15 Update From Choreographer Jani Master:

Ram Charan Dance Highlight in RC15 says Choreographer Jani Master
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs