Advertisement
Google Ads BL

రష్మిక లక్ మాములుగా లేదు


ప్రస్తుతం ప్రతి భాషలోనూ రష్మిక హవానే నడుస్తుంది. టాలీవుడ్ లో పుష్ప తో ఫస్ట్ పాన్ ఇండియా హిట్ కొట్టి.. పార్ట్2 షూట్ కి రెడీ అవుతున్న రష్మిక అటు బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది. అమితాబ్ తో కలిసి నటించిన ఫస్ట్ హిందీ డెబ్యూ గుడ్ బై గత వారమే ఆడియన్స్ ముందుకు వచ్చింది. అక్కడ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్స్ కి పోటీగా తయారైన రష్మిక లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులోనే కాదు, ఇప్పుడు తమిళంలోనూ జెండా పాతడానికి రెడీ అయ్యింది..

Advertisement
CJ Advs

కార్తీ తో సుల్తాన్ తో గ్రాండ్ గా తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక కి ఆ సినిమా డిస్పాయింట్ చెయ్యగా.. ఇప్పుడు స్టార్ హీరో విజయ్ తో తెలుగు తమిళ్ బైలింగువల్ మూవీ వారసుడు చేస్తుంది. అయితే మరోసారి రష్మిక కి సినిమాలో ఛాన్స్ వచ్చిందనే న్యూస్ నడుస్తుండగానే.. ఇపుడు ధనుష్ తో రష్మిక కి మరో ఆఫర్ దక్కింది అంటున్నారు. ధనుష్-శేఖర్ కమ్ముల కలయికలో మూడు భాషల్లో తెరకెక్కబోయే పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా రష్మిక పేరే వినిపిస్తుంది. శేఖర్ కమ్ముల మనసులో సాయి పల్లవి ఉన్నప్పటికీ.. ఆమెకి హిందీలో పెద్దగా క్రేజ్ లేదు, రష్మిక అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని ధనుష్ కి జోడిగా రష్మిక నే ఎంపిక చేసే ప్లాన్ లో శేఖర్ కమ్ముల ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే నిజమైతే రష్మిక లక్కు మాములుగా కాదు.. అదిరిపోతోంది అంతే.

Rashmika To Play Female Lead in Dhanush:

Rashmika Mandanna to romance Dhanush for Sekhar Kammula movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs