ఆచార్య తర్వాత ఇమ్మిడియట్ గా కొరటాల శివ ఎన్టీఆర్ తో NTR30 మొదలు పెట్టెయ్యాల్సి ఉంది. కానీ ఆచార్య దెబ్బకి కొరటాల అజ్ఞాతవాసం ఇంకా ముగియలేదు. ఎన్టీఆర్ తో కొరటాల స్టార్ట్ చెయ్యబోయే మూవీ పై ఫాన్స్ చాలా ఆతృతగా ఉన్నారు. ఫాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో.. అంతగా ఆ సినిమా వెనక్కి వెళుతూనే వుంది. కొరటాల ఇంకా ఎన్టీఆర్ స్క్రిప్ట్ మీద ఉన్నారని, చెక్కుతున్నారు. ఎన్టీఆర్ కూడా కొరటాలని కలిసి క్లైమాక్స్ ని మార్చమని చెప్పినట్టుగా కూడా వార్తలొచ్చాయి. ఏది ఏమైనా ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఆరు నెలలైనా ఆయన తన కొత్త సినిమా మొదలు పెట్టకుండా ఉండేసరికి ఫాన్స్ లో ఆందోళన మొదలయ్యింది.
కొరటాల ఆచార్య విషయంలోనే కాదు, రాజమౌళి సెంటిమెంట్ విషయంలోనూ ఆందోళన పడుతున్నట్లుగా తెలుస్తుంది. అంటే రాజమౌళి తో హిట్ తర్వాత హీరోలకి ప్లాప్ పడడం అనేది ఆనవాయితీగా వస్తుంది. దానికి రామ్ చరణ్ ఆచార్య తో డిసాస్టర్ అందుకోవడం మరోసారి ప్రూవ్ చేసింది. ట్రిపుల్ ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చరణ్.. ఆచార్య తో డిసాస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా దానికి అతీతుడు కాడేమో.. ఎన్టీఆర్ సినిమా హిట్ అవ్వకపోతే ఆయన కన్నా ఎక్కువగా నష్టపోయేది కొరటాలే. ఒకవేళ రాజమౌళి సెంటిమెంట్ ఎన్టీఆర్ కి కూడా వాటిస్తే.. తర్వాత పరిస్థితి ఏమిటి అనే ఆలోచనలోను కొరటాల మధనపడుతున్నాడట. అందుకే స్క్రిప్ట్ ని బాగా చెక్కాకే ఎన్టీఆర్ తో ఖచ్చితంగా హిట్ కొట్టి రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేసే ఉద్దేశ్యంతోనే కొరటాల ఎన్టీఆర్ కథ విషయంలో ఇంత లేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.