Advertisement
Google Ads BL

నాది కాదని వదిలేసానంటున్న మెగాస్టార్


మెగాస్టార్ చిరంజీవి కి ఆచార్య వలన ఎంత పెద్ద లాసో అనేది ఆయన గాడ్ ఫాదర్ ఇంటర్వూస్ లో చెప్పకనే చెప్పారు. ఆచార్య డిసాస్టర్ వలన డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోవడంతో కొరటాల ఆఫీస్ ని చుట్టుముట్టగా కొరటాల చాలావరకు సెటిల్ చేసాడని అందుకే కొరటాల ఇంకా తేరుకోలేకపోతున్నాడనే న్యూస్ ఇప్పటికి సంచలనంగానే ఉంది. అయితే మొన్నామధ్యన చిరు దర్శకులు సెట్స్ లోకి వచ్చి డైలాగ్స్ రాస్తున్నారు, దానివలన నటులు సరిగ్గా పెరఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు.. దాని వలన నేను సఫర్ అయ్యా అన్నారు.. దానితో చిరు మాట్లాడింది కొరటాల గురించే, ఆచార్య డిసాస్టర్ విషయంలోనే కొరటాలపై చిరు ఇండైరెక్ట్ కామెంట్స్ చేసారని ప్రచారం షురూ అయ్యింది. 

Advertisement
CJ Advs

కానీ నేను కొరటాల గురించి మాట్లాడలేదు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులని చూసి మాట్లాడుతున్నా అంటూ మెగాస్టార్ గాడ్ ఫాదర్ ఈవెంట్స్ లో క్లారిటీ ఇచ్చారు. ఇక నిన్న జరిగిన గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో ఆచార్య పోవడం వలన చాలా పెద్ద మొత్తం వెనక్కి ఇచ్చేసాను, నాది కాదని వదిలేసాను. చరణ్ బాబు కూడా చాలా వదులుకున్నాడు. దాని వలన నాకు నష్టం కలగడం అటుంచి కొంతలో కొంత డ్యామేజ్ ని కవర్ చేశామంటూ ఆచార్య లాస్ ని చిరంజీవి స్వయంగా భరించామంటూ క్లారిటీ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.

Chiru Speaks About Returned Remuneration:

 Chiranjeevi opened up about Rumours which is Circulating about Acharya Loss 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs