Advertisement
Google Ads BL

‘ఆటోజానీ’ని మించిన కథతో కలుస్తా!


మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మెగాస్టార్ యమా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. విడుదలకు ముందు.. మరో చిత్ర షూటింగ్‌లో పాల్గొంటూనే.. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చిరు పాల్గొన్నారు. సినిమా విడుదల తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకుని, థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. అయినా కూడా ఈ సినిమాని మరింతగా ప్రేక్షకులలోకి తీసుకెళ్లేందుకు చిరు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా.. ఫస్ట్ టైమ్ ఆయన ఇన్‌స్టాగ్రమ్ లైవ్‌లోకి వచ్చి కూడా సినిమాని ప్రమోట్ చేశారు. ఇన్‌స్టాగ్రమ్ లైవ్‌లో దర్శకుడు పూరీతో చిరు చేసిన ఛాట్‌లో.. ‘గాడ్‌ఫాదర్’ సినిమా గురించే కాకుండా.. చిరు-పూరి కాంబినేషన్‌లో అనుకున్న ‘ఆటోజానీ’ టాపిక్‌ కూడా వచ్చింది. 

Advertisement
CJ Advs

 

‘‘మన ‘ఆటోజానీ’ ఏం చేశావ్.. ఉందా? లేదా? లేదంటే చించి పక్కన పడేశావా?’’ అని నవ్వుతూ చిరు అడిగిన ప్రశ్నకు.. ‘‘ఆటోజానీ పక్కన పడేశాను సార్.. దానికంటే మంచిది రాస్తున్నాను. త్వరలోనే వచ్చి కలుస్తాను..’’ అని పూరీ సమాధానమిచ్చారు. దీనికి ‘‘ఎనీ టైమ్.. ఇద్దరం సక్సెస్‌ఫుల్ సినిమాలో పార్ట్ అయ్యాం కాబట్టి.. మీకు నేను అవకాశం ఇచ్చాను కాబట్టి.. నాకు కూడా అవకాశం ఇవ్వు. మనం చేద్దాం.. వేరే ఆప్షన్స్ ఉంటే మోస్ట్ వెల్‌కమ్. పూజా కార్యక్రమాలు ఉంటే నేనే వచ్చి.. క్లాప్ కొడతాను. ఫ్యూచర్‌లో మనద్దరి కాంబినేషన్‌లో రాబోయే సినిమా కోసమేనేమో.. మనం ఇలా కలిసి నటించాం.. వండర్‌ఫుల్.. చాలా హ్యాపీ’’ అంటూ చిరు సంతోషం వ్యక్తం చేశారు.

Puri Jagannadh about Auto Jani Script:

Chiranjeevi asked Puri Jagannath about the Auto Jani Script
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs