మెగాస్టార్ చిరంజీవి-బాబీ కలయికలో మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మెగా 154 షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ సక్సెస్ జోష్ లో ఇంకా ఇంకా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. గాడ్ ఫాదర్ సెకండ్ వీక్ లోకి ఎంటర్ అవడంతో మెగాస్టార్ కూడా రిలాక్స్ అవ్వబోతున్నారు. ఈరోజు మీడియా మీట్స్ తో గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ ని ముగించేసి తదుపరి సినిమాల షూటింగ్ లోకి వెళ్ళబోతున్నారు చిరు. అయితే ఈ ఏడాది ఆచార్య తో, గాడ్ ఫాదర్ తో బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి మరో సినిమాని సంక్రాంతికి రెడీ చేస్తున్నారు. అదే మెగా 154.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి వాల్తేర్ వీరయ్య టైటిల్ ని అనుకుంటున్నారు. అయితే రేపు దీపావళి పండగ రోజున మెగా 154 నుండి టైటిల్ మాత్రమే మరో సర్ ప్రైజ్ కూడా ఉండబోతుంది. అది Mega 154 గ్లిమ్ప్స్ ని కూడా రిలీజ్ చెయ్యబోతున్నారు. అంటే ఒకే పండగ రెండు ట్రీట్స్ అన్నమాట. మరి మెగా ఫాన్స్ గాడ్ ఫాదర్ సక్సెస్ ని ఆస్వాదించేలోపే మరో మూవీ టైటిల్, గ్లిమ్ప్స్ తో ఫెస్టివల్ కి క్రాకర్స్ కలిసి జరుపుకోవడానికి రెడీ అవ్వాల్సిందే. ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్. చిరు ముఠామేస్త్రి రోజులు గుర్తుకు తెచ్చేలా ఈ వాల్తేర్ వీరయ్య మాస్ ఆడియన్స్ కి కి ఇచ్చేదిలా ఉండబోతుంది.