Advertisement
Google Ads BL

లైగర్ ఫెయిల్యూర్: పూరికి క్లాస్ పీకిన మెగాస్టార్


లైగర్ ఫెయిల్యూర్ తర్వాత పూరి జగన్నాథ్ రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమాలో నటుడిగా ఆడియన్స్ కి దర్శనమిచ్చాడు. లైగర్ హిట్ అవుతుందని ఎంతో నమ్మిన పూరి కి ఆ సినిమా పాన్ ఇండియా లెవల్లో షాక్ ఇవ్వడం కోలుకోలేని దెబ్బే. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సక్సెస్ మూడ్ లో ఉన్న పూరి మెగాస్టార్ ని ఇన్స్టా వేదికగా చిట్ చాట్ చేసారు. ఆ చిట్ చాట్ లో పూరీనే కాదు, మెగాస్టార్ కూడా పూరీని ప్రశ్నలతో బంధించారు. ఈమధ్యన రీసెంట్ గా ప్లాప్ ని చవి చూసిన మీకు ఎలా అనిపిస్తుంది అని అడిగారు. దానికి పూరి కూడా సెటిల్డ్ గా సమాధానం చెప్పారు. హిట్ వస్తే ఎనర్జీ వస్తుంది, ప్లాప్ అయితే మూడ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. హిట్ ఉన్నప్పుడు జీనియస్‌లా కనిపిస్తాం. ఫెయిల్ అయితే ఫూల్‌లా కనిపిస్తాం. ఒక్కోసారి మనం అంటే ఎంతో నమ్మకం ఉన్నవారు, మనం నమ్మిన వాళ్ళు కూడా స్కిప్ అయిపోతుంటారు.. ఒత్తిడితో పాటుగా రకరకాల ప్రోబ్లెంస్ ఫేస్ చెయ్యాలి.

Advertisement
CJ Advs

ఏది చేసినా అది ఒక్క నెలలో ముగిసిపోవాలి. తర్వాత పనిలో పడిపోవాలి. లైగర్ సినిమాని మూడేళ్లు తెరకెక్కించాను, మూడేళ్లు లో ప్రతి క్షణం ఎంజాయ్ చేశా, కానీ ఫెయిల్ అయ్యాను, అలాగని మూడేళ్లు ఏడుస్తూ టైం వెస్ట్ చేసుకోలేను. నేను ఎన్నో ఫెయిల్యూర్స్ చూసా.. అలాగని మధనపడిపోలేదు.. మళ్ళీ నిలదొక్కుకున్నా అని పూరి చెప్పగానే మెగాస్టార్ కలగజేసుకుని.. హీలింగ్ పీరియడ్ తగ్గించుకుంటాను.. అనేది మంచి డెసిషన్. నేను నా 44 ఏళ్ళ కెరీర్ అనుభవంతో మీకొకటి చెబుతా.. మీరింకా ధైర్యంగా ఉండాలి. ఫెయిల్యూర్ అనగానే బాధపడిపోవడం, హిట్ అనగానే ఎనర్జీ వస్తుందని మీరు అన్నారు కదా.. కానీ హిట్ తోటి ఎనెర్జీ రాదు. ఫెయిల్ అయ్యామని డల్ అవ్వకూడదు. దానిని ఛాలెంజ్‌గా తీసుకుని.. ఇంకాస్త కసి పెంచుకుని ఎక్కడ తప్పు జరిగింది అని ఆలోచించాలి. నేను రీసెంట్ గా ఓ డిసాస్టర్ చవిచూసా.. అలా అని బాధపడలేదు, ఓ నెల ట్రిప్ వేసి వచ్చా.. మళ్ళీ రీఛార్జ్ అయ్యా. తర్వాత గాడ్ ఫాదర్ సెట్స్ లోకి వెళ్ళా.. అందరిలో జోష్ నింపి ఉత్సాహంగా సినిమా చేశాను.

సో మీరు లైగర్ తర్వాత రెస్ట్ తీసుకోండి. కానీ డోంట్ రిలాక్స్. ఛాలెంజ్‌గా తీసుకోండి. మీసం మెలేసి మళ్లీ రంగంలోకి దిగిపోండి.. అంటూ మెగాస్టార్ పూరికి సలహాలు ఇచ్చారు.

Puri Jagan finally responds about Liger movie failure :

Director Puri Jagan finally responds about Liger movie result
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs