Advertisement
Google Ads BL

పెళ్లి విషయంలో వెటకారం చేస్తున్న రకుల్


టాలీవుడ్ లో టాప్ పొజిషన్ ని చేజార్చుకుని.. బాలీవుడ్ లో సెటిల్ అవడానికి కిందా మీదా పడుతున్న రకుల్ ప్రీత్ ఈ మధ్యన జాకీ భగ్నానీ తో లవ్ ని మెయింటింగ్ చేస్తుంది. బాలీవుడ్ హీరో కమ్ ప్రొడ్యూసర్ జాకీ తో ప్రేమాయణం నడుపుతున్న రకుల్ ప్రీత్ తాజాగా తన పెళ్లి విషయంలో వెటకారంగా స్పందించింది. అటు టాలీవుడ్ మూవీస్ లో నటించకపోవడంపై కూడా రకుల్ ప్రీత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ ఇలా స్టార్ హీరోలతో సినిమాలు చేసిన మీరు కొన్నాళ్లుగా టాలీవుడ్ కి దూరమెందుకయ్యారు అని అడగగా.. దానికి రకుల్ చాలామంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు.

Advertisement
CJ Advs

నేను కొంతకాలంగా తెలుగులో నటించడం లేదనే విషయం నాకూ తెలుసు. త్వరలోనే టాలీవుడ్ సినిమాల్లో నటిస్తాను, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటారు, వారిని ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను అంటూ చెప్పింది. అలాగే మీ తమ్ముడు అమన్.. మీరు జాకీ భగ్నానీ కలిసి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారుని ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.. దీనిపై మీరేమంటారు అని రకుల్ ని అడగగా.. దానికి రకుల్ అవునా.. అమన్ నువ్వు నా పెళ్లి గురించి నిజంగా అలా చెప్పావా.. నా పెళ్లి గురించి నాక్కూడా చెప్పాలి కదా బ్రో.. నా పెళ్లి గురించి నాకే తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉంది అంటూ కాస్త వెటకారం చేసింది రకుల్ ప్రీత్.

Rakul Preet reacts to wedding rumours with beau Jackky Bhagnani:

Rakul Preet Singh reacts to reports of her wedding plans with Jackky Bhagnani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs