మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లో దర్శకుడు పూరి జగన్నాధ్ కూడా భాగమయ్యారు. అదేదో టెక్నీకల్ గా కాదు, పూరి నటుడిగా గాడ్ ఫాదర్ లో నటించారు. జర్నలిస్ట్ గా పూరి జగన్నాధ్ తన యాటిట్యూడ్ చూపించారు. గాడ్ ఫాదర్ సక్సెస్ అవడంతో టీం అంతా ఫుల్ జోష్ లో ఇంకా ఇంకా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా చిరంజీవి ఫస్ట్ టైం ఇన్స్టా చిట్ చాట్ చేసారు. అది కూడా పూరి వ్యాఖ్యాతగా.. పూరి జగన్నాథ్ అడిగే ప్రశ్నలకి చిరంజీవి కూడా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు. చిరు తో పూరి జగన్నాథ్ మీతో చేద్దామనుకున్న ఆటోజానీ స్క్రిప్ట్ పక్కనపడేసి.. కొత్త స్టోరీ, అది కూడా పవర్ ఫుల్ కథ రెడీ చేసి మీ దగ్గరకి వస్తున్నా అంటూ చెప్పి ఆసక్తిని రేపారు.
గాడ్‌ఫాదర్ చిత్రం కంప్లీట్ పొలిటికల్ డ్రామా. మీకు పాలిటిక్స్‌లో ఇష్టమైన లీడర్ ఎవరై ఉండొచ్చు, ఇప్పుడే కాదు, ఇంతకుముందు ఏ జనరేషన్ అయినా కావచ్చు.. అని పూరి అడిగిన ప్రశ్నకి మెగాస్టార్ తనదైన శైలిలో జవాబు చెప్పారు. ఈ జనరేషన్ అంటే నేను చెప్పలేను, సైలెంట్ గా ఈ ప్రశ్నని స్కిప్ చేసేవాడిని, కానీ పాత జనరేషన్ అని కూడా అడిగావు కాబట్టి.. నా దృష్టిలో చాలామంది మహానుభావులు ఉన్నారు. వాళ్లలో లాల్ బహదూర్ శాస్త్రిగారు మహానుభవుడు, ఆయన సింప్లిసిటీ, తన జీవితాన్ని దేశ కోసం త్యాగం చేసిన మహానుభావుడు. మహాత్మాగాంధీగారి తో పాటుగా అదే రోజు పుట్టిన లాల్ బహదూర్ శాస్త్రిగారు గొప్ప రాజకీయ నాయకుడిగా నేను ఇష్టపడుతుంటాను. ఆ తర్వాత అటల్ బిహారి వాజపేయి అంటే ఇష్టం. వీరిద్దరిని గొప్ప రాజకీయనాయకులుగా ఇష్టపడతాను అంటూ మెగాస్టార్ చెప్పారు.