ఎన్టీఆర్-కొరటాల మూవీ అప్ డేట్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాచిపోతున్నాయి. ఇదిగో అప్ డేట్ అదిగో అప్ డేట్ అంటూ ఊహించుకుని పదే పదే ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో చేసే హడావిడి తప్పితే NTR30 అప్ డేట్ కానరావడం లేదు. దసరా కి ఎట్టిపరిస్థితుల్లో NTR30 అప్ డేట్ మేకర్స్ ఇస్తారని చాలా ఆశపడ్డారు. కానీ కొరటాల నుండి కానీ, ఎన్టీఆర్ కానీ NTR30 విషయమై ఎక్కడా న్యూస్ రాలేదు. ఇక అక్టోబర్ 12 అంటే ఈ రోజు NTR30 నుండి అప్ డేట్ రాబోతుంది అంటూ రెండు రోజులుగా ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
కానీ ఈరోజు కూడా ఎన్టీఆర్ ఫాన్స్ మోసపోయారు. NTR30 నుండి ఎలాంటి మెసేజ్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ నవంబర్ 12 నుండి NTR30 షూటింగ్ మొదలవుతుంది అంటున్నారు. ఫాన్స్ ఆశపడడం, అంతలోనే నిరాశకు లోనవడం అనేది ఈమధ్యన NTR30 అప్ డేట్ విషయంలో తరుచూ జరుగుతుంది. అటు ఎన్టీఆర్ కూడా సైలెంట్ మోడ్ లో ఎందుకున్నాడో.. మిగతా హీరోలేమో వరసగా ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా వుంటుంటే.. ఈయన మాత్రం సైలెన్స్ మెయింటింగ్ చేస్తూ ఫాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నాడు.