Advertisement
Google Ads BL

సమంత మళ్లీ తోడు కోరుకుంటుందా?


టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. హీరోల పక్కన హీరోయిన్‌గానే కాకుండా.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు, ఐటమ్ సాంగ్స్, ప్రయోగాత్మక చిత్రాలు, వెబ్ సిరీస్‌లు.. ఇలా అన్నింటిలోనూ సమంత అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే కొన్ని రోజులుగా సమంతపై ఎటువంటి వార్తలు వినిపిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆమె ఏదో వ్యాధితో బాధపడుతుందని, అమెరికాకు ట్రీట్‌మెంట్ కోసం వెళ్లిందని.. కాదు కాదు సీటాడెల్ వెబ్ సిరీస్ నిమిత్తం శిక్షణకు వెళ్లిందని.. ఇలా రకరకాలుగా వార్తలు ఆమెపై వైరల్ అవుతున్నాయి. వాటిపై ఆమె మ్యానేజర్ ఎంత వివరణ ఇచ్చినా.. వార్తలు మాత్రం ఆగడం లేదు. ఇదిలా ఉంటే.. సమంత ట్విట్టర్ వేదికగా చేసే కొన్ని పోస్ట్‌లిప్పుడు.. ఆమె గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి. ఆ ట్వీట్స్ చూస్తుంటే.. సమంత మళ్లీ తోడు కోరుకుంటుందా? అనేలా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Advertisement
CJ Advs

 

తాజాగా ఆమె ‘తోడు లేకుండా నువ్వు బ్రతకలేవు’ అనే కొటేషన్‌తో ఉన్న టీషర్ట్‌ను ధరించిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనర్థం తోడు కావాలనే కదా. అందుకే.. ఐశ్వర్య, ధనుష్‌లా మళ్లీ సమంత, చైతూ కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అనేలా కొందరు.. ‘ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది.. అందుకే ఇలా హింట్స్ పంపుతుంది’ అని మరికొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమె పోస్ట్‌కు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్‌తో.. సమంత పోస్ట్ సంచలనంగా మారింది. మళ్లీ పెళ్లిపై ఏమైనా మనసు మళ్లీందేమో.. మరి ఈ అర్థం కాని పోస్ట్‌పై సమంత ఏమైనా వివరణ ఇస్తుందేమో.. చూద్దాం. ఇక ఆమె నటించిన రెండు సినిమాలు ‘యశోద’, ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. విజయ్ దేవరకొండతో చేస్తున్న ‘ఖుషి’ చిత్రం సెట్స్‌పై ఉంది. ఇవి కాకుండా.. బాలీవుడ్‌లో సమంత కొన్ని ప్రాజెక్ట్స్ కమిట్ అయినట్లుగా తెలుస్తోంది.

Samantha Social Media Post Creates Sensation:

Is Samantha wants Second Marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs