Advertisement
Google Ads BL

బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాటజీలు ఎక్కువయ్యాయి


బిగ్ బాస్ సీజన్ 6 ఆరో వారం లో కెప్టెన్సీ టాస్క్ మొదలయ్యింది. హౌస్ మేట్స్ ని ఎమోషనల్ గా బిగ్ బాస్ బ్లాక్ మెయిల్ చేసి బాటరీ ఛార్జ్ లాగేస్తున్నాడు. సుదీప కి భర్త తో మాట్లాడేందుకు 30 పర్సెంట్ బాటరీ తీసుకున్న బిగ్ బాస్ తో శ్రీహన్ 15 శాతంతో ఫుడ్ డీల్ తీసుకున్నాడు. ఇక ఆది రెడ్డి అయితే తన భార్య కూతురుతో వీడియో కాల్ మాట్లాడాడు. అదలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ అంతా చాలా స్ట్రాంగ్ స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారు. మొదటి నుండి గీతు, ఆదిరెడ్డి లు కంటెంట్ ఎలా ఇవ్వాలి, కంటెంట్ ఇవ్వడానికి ఎలా ఉండాలో అదే చేస్తున్నారు. ఆదిరెడ్డి ప్రతిదానికి స్ట్రాటజితో గేమ్, టాస్క్ ఆడుతున్నాడు. ఇక సూర్య అయితే అమ్మాయిల తో ట్రాక్ సెట్ చేసుకుంటే ఫుటేజ్ ఇవ్వొచ్చనే ఊహల్లో ఉన్నాడు. గతంలో రాహుల్ సిప్లిగంజ్, అఖిల్ కి వర్కౌట్ అయినట్లుగా తనకీ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాడు. 

Advertisement
CJ Advs

అందుకే మొన్నటివరకు ఆరోహితో లవ్ ట్రాక్ నడిపిన సూర్య ఆమె వెళ్ళగానే ఇనాయని తగులుకున్నాడు. అంతేకాకుండా గత రాత్రి రాజ్ నామినేషన్స్ లో ఉండి ఫీలవుతుంటే.. ఎందుకురా ఫీలవుతున్నావ్.. మా నలుగురి ఓట్స్ నీకే పడతాయ్. నువ్ మా ఫ్రెండ్ వి, మేము కూడా నామినేషన్స్ లో ఉంటే నువ్ ఫిలవ్వాలి అని చెబుతున్నాడు. ఇక వాసంతి, కీర్తి లు హౌస్ లో ఎందుకు ఉన్నారో తెలియదు, కీర్తి చాలావరకు ఏడుస్తూనే కనబడుతుంది. ఎమన్నా మాట్లాడితే బయటికి ఎలా పోట్రెట్ అవుతుందో అని అనుక్షణం ఆలోచిస్తుంది.. ఇలా హౌస్ లోని చాలామంది ఎవరి స్ట్రాటజీలని వాళ్ళు ప్లే చేస్తూ బిజీగా కనబడుతున్నారు.

Bigg Boss 6: Strategies have increased in the house:

Bigg Boss 6 Yeasterday Episode highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs