Advertisement
Google Ads BL

ప్రాజెక్ట్ K నుండి అమితాబ్ కి విషెస్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నేషనల్ అవార్డు విన్నర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ K షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ లో ఉంది. ప్రభాస్ మోకాలి ఆపరేషన్, అలాగే మధ్యలో ఆయన ఇంట్లో జరిగిన ఓ విషాదం, ఆదిపురుష్ టీజర్ లాంచ్ ప్రోగ్రామ్స్ తో ప్రభాస్ కొద్దిగా బిజీగా మారారు. అయితే ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రాజెక్ట్ K లో అమితాబచ్చన్ కీ రోల్ పోషిస్తున్నారు. దీపికా పడుకొనే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రభాస్ కర్ణుడి తరహా పోలికలు కలిగిన హీరోగా కనిపిస్తారట. అలాగే అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్ర తరహాలో కనిపిస్తారని కూడా కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 

Advertisement
CJ Advs

భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం నుండి లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ 80వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసి, సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది, ఆ పోస్టర్ లో చేతిని పిడికిలిలో చూపిస్తుంది. పోస్టర్‌పై లెజెండ్స్ అమరత్వం అంటే.. వారు ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటారు.. అంటూ అమితాబ్ పాత్రని ఆ పోస్టర్ లో సూచిస్తుంది. ఇక ప్రాజెక్ట్ K కొత్త షెడ్యూల్ ఈనెల మూడో వారం నుండి మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

Project K celebrates Amitabh Bachchan birthday:

Amitabh packs Project K punch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs