రామ్ చరణ్- కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కలయికలో దిల్ రాజు మూడు భాషల్లో భారీగా RC15 మొదలు పెట్టాడు. శంకర్ కూడా రామ్ చరణ్ ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు RC15 చిత్రీకరణని శరవేగంగానే కానిచ్చేశారు. కానీ అనుకోని అవాంతరం అన్నట్టుగా శంకర్ ఇండియన్ 2 విషయంలో ఇరుక్కోవడంతో చరణ్ తో పది రోజులు, కమల్ తో పదిరోజులు అన్నట్టుగా ఆయన ట్రావెల్ చేస్తున్నారు. దానితో RC15 అప్ డేట్ కానీ, ఆ సినిమా రిలీజ్ డేట్ కానీ బాగా లేట్ అవుతుంది. అయితే RC15 షూటింగ్ మొదలు పెట్టింది మొదలు ఆ సినిమాలో రామ్ చరణ్ లుక్ షెడ్యూల్స్ వారీగా లీకవుతూనే ఉన్నాయి.
ఒకసారి, రెండోసారి అంటే ఓకె.. కానీ RC15 లుక్స్ పదే పదే లీకవడం అనేది దిల్ రాజు ఫెయిల్యూర్ అనే చెప్పాలి, ఎంతగా కట్టడి చేసినా రామ్ చరణ్ లుక్ ఈ విధంగా లీకై వైరల్ అవడం సినిమాపై ఉన్న క్యూరియాసిటీ , ఆ లుక్ రిలీజ్ చేసేటప్పుడు ఉండాల్సిన హైప్ అన్ని పోతాయి. మరి దిల్ రాజు కట్టుదిట్టమైం ఏర్పాట్లు చెయ్యాలి. ఇలాంటి లీకులు లేకుండా ఆపాలి. తాజాగా రాజమండ్రి పరిసర ప్రాంతంలో జరుగుతున్న RC15 షూటింగ్ స్పాట్ నుండి రామ్ చరణ్ అంజలి కి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అది చూసిన జనాలు అంజలి రామ్ చరణ్ కి తల్లిగా కనిపిస్తున్నట్టుగా ఇమాజిన్ చేసేసుకుంటున్నారు.
లీకైన ఫోటోలో పంచ కట్టులో తన భార్య కొడుకుతో రామ్ చరణ్ కనిపిస్తూ ఉండడం చూస్తూ ఫాన్స్ రకరకాల ఊహాగానాలు మొదలు పెట్టేసారు. ఇలా పదే పదే లీకవుతూ యూనిట్ ని టెన్షన్ పెడుతున్నా దిల్ రాజు RC15 షూటింగ్ ని ఇంత లైట్ తీసుకోవడం ఏమిటో అర్ధం కాక ఇప్పుడు మెగా ఫాన్స్ తల పట్టుకుంటున్నారు.