Advertisement
Google Ads BL

సూపర్ స్టార్ కి థాంక్స్ చెప్పిన మోహన్ రాజా


మెగాస్టార్ చిరంజీవి తో మలయాళ సూపర్ హిట్ ఫిలిం లూసిఫెర్ ని తెలుగు నేటివిటీకి మాత్రమే కాదు, అన్ని భాషల ప్రేక్షకులకి దగ్గరయ్యేలా స్క్రిప్ట్ ని మార్చి గాడ్ ఫాదర్ గా రీమేక్ చెయ్యగా.. ఆ సినిమా మంచి హిట్ అవడంతో చిరంజీవి మాత్రమే కాదు, దర్శకుడు మోహన్ రాజా, అలాగే యూనిట్ అంతా ఫుల్ హ్యాపీ గా ఉంది. మెగా ఫాన్స్ అయితే దసరా ఫెస్టివల్ సెలెబ్రేషన్స్ తో పాటుగా గాడ్ ఫాదర్ సక్సెస్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. అటు తమిళ్, ఇటు హిందీ నుండి గాడ్ ఫాదర్ మంచి వసూళ్ళని రాబట్టడం, ప్రముఖుల ప్రశంశలు ఎక్కువయ్యాయి. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ గాడ్ ఫాదర్ ని వీక్షించి దర్శకుడు మోహన్ రాజాని ప్రశంసించిన విషయాన్ని ఆయన ఎంతో ఆనందంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ... 

Advertisement
CJ Advs

సూపర్ స్టార్ రజిని సర్ గాడ్ ఫాదర్ ని చూసారు. మూవీ చాలా బాగుంది అన్నారు. ప్రత్యేకంగా తెలుగు వెర్షన్ కోసం చేసిన మార్పులు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ధన్యవాదాలు రజినీ సర్, నా జీవితంలో అద్భుతమైన క్షణాల్లో ఇది ఒకటి అంటూ మోహన్ రాజా సూపర్ స్టార్ రజినికాంత్ కి థాంక్స్ చెప్పిన పోస్ట్ వైరల్ గా మారింది.

SuperStar Rajnikanth appreciates Megastar GodFather:

Rajinikanth congratulated Godfather director Mohan Raja
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs