Advertisement
Google Ads BL

ఎలిమినేషన్ పై చంటి షాకింగ్ కామెంట్స్


బిగ్ బాస్ సీజన్ 6 ఐదో వారానికి చలాకి చంటి ఎలిమినేట్ అయ్యి అందరికి షాకిచ్చాడు. అసలు చంటి ఎలిమినేట్ అవడం ఎవరికి అర్ధమే కాలేదు. సుదీప, వాసంతి, రాజ్ ఇలా అసలు ఎలాంటి ఫేమ్ లేని వాళ్ళు, పెరఫార్మెన్స్ ఇవ్వలేని వారు హౌస్ ఎలా ఉండి చంటి ఎలిమినేట్ అవడం హౌస్ మేట్స్ కి షాకే, బయట ఉన్న చంటి ఫాన్స్ కి షాక్. ఇక చంటి మాత్రం బిగ్ బాస్ హౌస్ నుండి చాలా హుందాగానే బయటికి వచ్చాడు. బయటికొచ్చాక కూడా ఎవరి మీదా ఆరోపణలు చెయ్యకుండా తనదైన  శైలిలో మాట్లాడుతున్నాడు. చంటి ఎమన్నా కాంట్రవర్సీ మాట్లాడతాడేమో అని చాలామంది చాలానే వెయిట్ చేసారు. యూట్యూబ్ ఛానల్స్ అయితే చంటి చుట్టూనే తిరిగారు. కానీ చంటి ఎక్కడా బ్యాలెన్స్ తప్పలేదు, నేను ప్రేక్షకులకి నచ్ఛలేదు బయటికి వచ్చేసా అన్నాడు.

Advertisement
CJ Advs

తాజాగా నేను కావాలనే బయటికి వచ్చేసాను. నా కూతురు కోసం నేను ఎలిమినేట్ అయ్యాను, నాకు హౌస్ లో ఉండగా నా కూతురు గుర్తుకు వచ్చింది, నేను కొంచెం లో అయ్యాను, తర్వాత నేను హౌస్ నుండి బయటికి రావాలనుకున్నా.. అందుకే సెల్ఫ్ నామినేట్ అయ్యాను. ప్రేక్షకులు కూడా నన్ను బయటికి పంపించారు. నేను నాకూతురి దగ్గరకి వచ్చి ముద్దు పెట్టగానే రిలీఫ్ అయ్యాను, పదో వారమో, పదిహేనో వారమో బయటికి వస్తా అనుకున్నా, కాని ఇదో వారం వచ్చేసా.. ఎప్పటికైనా ఎలిమినేట్ అవ్వాల్సిందేగా అంటూ చంటి చాలా నార్మల్ గా సమాధానం చెప్పాడు.

Chanti shocking comments on the elimination:

Chalaki Chanti Shocking Comments About His Elimination
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs