Advertisement
Google Ads BL

పెళ్లిపై త్రిష ఇంట్రెస్టింగ్ కామెంట్స్


పెళ్లి వయసు దాటిపోయి చాలా రోజులైనా హీరోయిన్ త్రిష మాత్రం ఇప్పటివరకు పెళ్లి ఊసెత్తడం లేదు. కొద్దిరోజుల క్రితం త్రిష ఓ బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకోబోతుంది. పేరెంట్స్ చూసిన సంబంధమే త్రిష ఖాయం చేసుకుంటుంది, అతనితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది అనే వార్తలు చక్కర్లు కొట్టాయి. తర్వాత సడన్ గా త్రిష ఎంగేజ్మెంట్ బ్రేకప్ న్యూస్ కూడా బయట వినిపించింది. ఈమధ్యనే పొన్నియన్ సెల్వన్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన త్రిష కి తాజాగా తన పెళ్లి విషయమై ఎదురైన ప్రశ్నకు కాస్త సీరియస్ గానే సమాధానం చెప్పింది. దాదాపు అందరూ పెళ్లెప్పుడు చేసుకుంటావు అని అడుగుతున్నారు.. దాని వరకు ఓకె.. కానీ 40 ఏళ్ళు వస్తున్నాయ్, 50 ఏళ్ళు వస్తున్నాయ్ పెళ్ళెప్పుడు చేసుకుంటావ్ అని అడుగుతున్నారు.

Advertisement
CJ Advs

అలా అడగడం నాకు ఏ మాత్రం నచ్చదు. వయసుతో పెళ్లికి ముడి పెట్టవలసిన అవసరం కూడా లేదు.. నాకు సరైన వ్యక్తి దొరికితే నేను వివాహం చేసుకుంటాను. చిన్న కారణాలకు, ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితులకే విడాకులు తీసుకుంటున్నారు, అవసరం లేని కారణాలతో విడిపోతున్నారు.. నాకు నచ్చకపోయినా పిల్లల కోసం కాంప్రమైజ్ అయ్యి ఉంటున్నా అని  చెప్పి హ్యాపీ గా లేకుండా బ్రతకడం కరెక్ట్ కాదు అంటూ త్రిష చెప్పుకొచ్చింది. అందుకే మంచి వ్యక్తి దొరగ్గానే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి అంటే నా దృష్టిలో లైఫ్ లాంగ్ కొనసాగే ఒక జర్నీ.. అంటూ త్రిష పెళ్లిపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

Trisha Interesting comments on marriage :

Trisha Interesting comments about her marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs