Advertisement
Google Ads BL

నయన్-విఘ్నేష్‌లకు కవల పిల్లలు!


స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఏంటి షాక్ అవుతున్నారా? నిజంగా నిజం. ఈ విషయం స్వయంగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తన ట్విట్టర్ వేదికగా తెలియజేయడమే కాకుండా.. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. దీంతో అభిమానులే కాదు.. జనాలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే, నయనతార మరియు విఘ్నేష్ శివన్‌ల పెళ్లి జరిగి నాలుగు నెలలు కూడా కాలేదు. అప్పుడే పిల్లలు ఎలా? అంటూ కొందరు.. పెళ్లినాటికే 3 నెలల గర్భవతి.. పెళ్లి తర్వాత 4 నెలలు.. ఇలా చూసినా 7 నెలలుకే పిల్లలు ఎలా అంటూ మరికొందరు ఆశ్చర్య వ్యక్తం చేస్తూ.. విఘ్నేష్ శివన్ ట్వీట్‌కు కామెంట్స్ చేస్తున్నారు. ఈ న్యూస్, ఈ కామెంట్స్‌తో ప్రస్తుతం నయనతార పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 

Advertisement
CJ Advs

 

‘‘నయన్, నేను అమ్మానాన్నలయ్యాము. మాకు ఇద్దరు మగబిడ్డలు జన్మించారు. మా ప్రార్థనలు, మా పెద్దలు దీవెనలన్నీ కలిసి.. మా ఇద్దరికీ మరో ఇద్దరు కలిగేలా చేశాయి. మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి. ప్రేమతో.. ఉయిర్ అండ్ ఉల్గమ్’’ అని విఘ్నేష్ శివన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా నయనతార నటించిన ‘గాడ్‌‌ఫాదర్’ చిత్రం దసరాకి విడుదలై సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో దూసుకెళుతోంది.

Nayanthara and Vignesh Shivan shared the good news:

Nayanthara - Vignesh Shivan became proud parents
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs