Advertisement
Google Ads BL

జబర్దస్త్ లో హిట్, బిగ్ బాస్ లో ఫట్


ఈ టివిలో జబర్దస్త్ ద్వారా ఫెమస్ అయిన కమెడియన్ చలాకి చంటి. జబర్దస్త్ లో టీం లీడర్ గా చంటి సుధాకర్ తో కలిసి స్కిట్స్ చేసి బాగా పాపులర్ అయ్యాడు. కొన్నాళ్ళు జబర్దస్త్ కి గ్యాప్ ఇచ్చినప్పటికీ మళ్ళీ జబర్దస్త్ లోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. మధ్యలో అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ పై అదృష్టాన్ని పరిక్షించుకున్న చంటి బిగ్ బాస్ సీజన్ నుండి ఆఫర్ రావడంతో అక్కడికి వెళ్ళాడు. సీజన్ 6 లోకి క్రేజీ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన చంటి అక్కడ కామెడీ చెయ్యడం తప్పించి పెద్దగా టాస్క్ ఆడలేకపోయాడు. ఈ ఐదు వారాల నుండి నామినేషన్స్ లోకి వెళ్ళినా మళ్ళీ సేవ్ అవుతూ వచ్చాడు. గలాటా గీతు చంటిని టార్గెట్ చేసినా ఎలాగో డిఫెండ్ చేసుకున్న చంటి ఐదోవారంలో గీతుతో కలసి నామినేషన్స్ ప్రక్రియ ఉండగా.. గీతు బ్రతిమలాడి చంటిని సెల్ఫ్ నామినేట్ అయ్యేలా చేసింది,.

Advertisement
CJ Advs

నామినేషన్స్ లో ఉన్నప్పటికీ చంటి తీరులో మార్పు లేదు, గేమ్ పరంగా ఆక్టివ్ అవ్వలేదు. దానితో తానెక్కడ ఎలిమినేట్ అవుతానో అనే భయంతో మూడు రోజులుగా చంటి ఏమి తినకుండా ఉన్నాడనే విషయం హౌస్ మేట్స్ మాట్లాడుకుంటేనే తెలిసిందే. బాలాదిత్య అన్నం ప్లేట్ పట్టికెళ్ళినా కూడా నాకు తినాలని లేదు, ఎలిమినేట్ అవుతానేనా అన్నట్టుగానే చంటి ఈ వారం ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసాడు. ఈ రోజ రాత్రి ఎపిసోడ్ లో చంటి ఎలిమినేషన్ ప్రసారం కాబోతుంది. అయితే జబర్దస్త్ కూల్ గా పంచ్ లు వేసుకుని హిట్ కొట్టిన చంటి బిగ్ బాస్ లో ఆ పంచ్ లతో ప్రభావం చూపలేకే ఎలిమినేట్ అయ్యాడు. గతంలో జబర్దస్త్ నుండి బిగ్ బాస్ కి వచ్చిన అవినాష్ లాస్ట్ వరకు ఉన్నాడు. ఇక ఈ సీజన్ లో ఫైమా అయితే టాస్క్ విషయంలోనే కాదు, మిగతా కామెడీ, వర్క్ ఇలా ఏ విషయంలోనూ తగ్గడమే లేదు. కానీ చంటినే మరీ డల్ అయ్యి ఎలిమినేషన్ వరకు తెచ్చుకున్నాడు అని ఆయన ఫాన్స్ ఫీలైపోతున్నారు.

Hit in Jabardasth, flop in Bigg Boss:

Chanti evicted from Bigg Boss house
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs