నందమూరి నటసింహం అల్లు కాంపౌండ్ ఆహా లో చేసిన అన్ స్టాపబుల్ టాక్ షో గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకునేలా చేసారు. బాలకృష్ణ టాక్ షో కి హోస్ట్.. ఇదే విచిత్రం, అది కూడా అల్లు కాంపౌండ్ లో అంటే అది మరింత షాకింగ్.. అన్ని షాక్ లని కలిపి సెలబ్రిటీస్ తో బాలకృష పవర్ ఫుల్ ప్రశ్నలతో షేకాడించారు. సెలబ్రిటీస్ ని నవ్వించారు, కవ్వించారు, ఆడించారు. సీజన్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో సీజన్ 2 పై హైప్ పెరిగింది. ఆ హైప్ కి తగ్గట్టే సీజన్ 2 ఉండబోతుంది. నారా చంద్రబాబు నాయుడితో సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ షూట్ చేసారు. బావ-బావమరుదులు ఒక టాక్ షో లో ఎలా ఉంటారో.. ఎలా మాట్లాడుకుంటారో.. ఎలాంటి ప్రశ్నలు, ఎలాంటి సమాధానాలు బయటికి వస్తాయో అనే ఆత్రుత పెంచేశారు. ఇప్పుడు అన్ స్టాపబుల్ టీజర్ మాత్రమే కాదు, ట్రైలర్ ని రిలీజ్ చేసారు. అందులో బాలకృష్ణ ఓ గుహలోకి వెళ్లడం, అక్కడ ఓ నిధి కోసం వేటాడడం, దాని కోసం సవాళ్ళని ఎదుర్కోవడం, అంధకార భయారణ్యంలో నిక్షిప్తమైన నిగూఢ నిధి అన్ ఇమేజనబుల్ అక్కడేదురయ్యే సవాళ్లు అన్ ప్రెడిక్టబుల్ అయినా ఆగని మన పోరాటం అన్‌స్టాపబుల్ గెలుపే ఊపిరిగా.. పట్టుదలే ప్రాణంగా ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్‌స్టాపబుల్ అంటూ ఈసారి
ప్రశ్నల్లో మరింత ఫైర్!
ఆటల్లో మరింత డేర్!!
సరదాల్లో మరింత సెటైర్!!!
మీకోసం... మరింత రంజుగా...
Season 2 streaming from October 14th, every Friday on aha!
దెబ్బకు థింకింగ్ మారిపోవాలా! అంటూ క్యూరియాసిటీని పెంచుతూ ట్రైలర్ ని ఎండ్ చేసారు.