Advertisement
Google Ads BL

గాడ్ ఫాదర్ క్లైమాక్స్ పై చిరు కామెంట్స్


మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ హిట్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోవడం మెగా ఫాన్స్ కి కిక్ ఇచ్చింది. ఆచార్య డిసాస్టర్ ని మురిపించేలా గాడ్ ఫాదర్ సక్సెస్ అవడం మెగా ఫాన్స్ ఆనందానికి కారణమయ్యింది. గాడ్ ఫాదర్ సూపర్ హిట్ అవడంతో చిరంజీవి కూడా హ్యాపీ మోడ్ లో ఉన్నారు. అదే ఉత్సాహంతో సక్సెస్ మీట్, సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ మీడియా చుట్టూనే ఉంటున్నారు. తాజాగా గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా క్లైమాక్స్ ని రీ షూట్ చేశామని, అది సినిమా విడుదలకి 15రోజుల ముందు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. అంతేకాకుండా ఈ సినిమా విడుదలకు ముందు నాకన్నా ఎక్కువగా సురేఖ టెన్షన్ పడింది అని, సినిమా హిట్ అని రిపోర్ట్స్ వచ్చాక కూల్ అయ్యామని చెప్పారు.

Advertisement
CJ Advs

ఇక గాడ్ ఫాదర్ క్లైమాక్స్ గురించి మట్లాడుతూ మొత్తం సినిమా షూటింగ్ అయ్యిపోయింది. నయన్, సత్య దేవ్ కి మీరు వేరే సినిమా షూటింగ్స్ ప్లాన్ చేసుకోండి. మన సినిమా అయ్యిపోయింది చెప్పాక.. క్లైమాక్స్ ఒకసారి చూసాం. ఎక్కడో సత్యదేవ్ మీద జాలి కలుగుతోంది. మనిషి ఒక్కసారిగా డంగ్ అయిపోయాడు. అలా నిస్సారంగా నించున్న మనిషిని కాల్చడం నాకే నచ్చలేదు. దానితో క్లైమాక్స్ మార్చమని చెప్పాను. అప్పుడు మోహన్ రాజా కూర్చుని అలోచించి మళ్ళీ క్లైమాక్స్ మొత్తం మార్చేసాం. సత్యదేవ్ విలనిజంగా ఇంకా ఇంకా పెంచాలని అనుకున్నా.. అది లాస్ట్ మినిట్ వరకు ఉండాలి, అలా లాస్ట్ మినిట్‌లో చెల్లెలును చంపేందుకు సత్యదేవ్ ప్లాన్ వేయడం, ఆ యాక్సిడెంట్ అతను ఫెయిల్ అవ్వడం, నేను అప్పటికే నా మనుషులను అక్కడ పెట్టడం నా ఫాదర్‌ను ఎలా చంపాడో విలన్‌ను కూడా అలానే చంపేలా ప్లాన్ చేసి రీషూట్ చేశాం. ఇది కూడా సినిమా రిలీజ్‌కు 15 రోజుల ముందు షూటింగ్ చేశాం.. అంటూ గాడ్ ఫాదర్ క్లైమాక్స్ పై మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. 

Chiranjeevi Interesting comments on Godfather Climax :

Chiranjeevi at Godfather Success Meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs