రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తో RC15 చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ కి గ్యాప్ గ్యాప్ లు వస్తున్నాయి. కారణం శంకర్ అటు కమల్ తో ఇండియన్ 2 షూటింగ్ చెయ్యడంతో RC15 షూటింగ్ కి బ్రేకులు పడుతున్నాయి. అయితే రామ్ చరణ్ తన తండ్రి గాడ్ ఫాదర్ కి వన్ అఫ్ ద నిర్మాత. ఆయన గాడ్ ఫాదర్ ప్రీ ప్రమోషన్స్ లో కానీ పోస్ట్ ప్రమోషన్స్ లో కనిపించనే లేదు. రామ్ చరణ్ గెస్ట్ గా గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నప్పటికీ అక్కడికి రామ్ చరణ్ రాలేదు. కానీ అల్లు రామలింగయ్య శతజయంతి రోజు జరిగిన బుక్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఇక గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లోనూ కనించలేదు.
అది సరే సినిమా హిట్ అయ్యింది, సక్సెస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అయినప్పటికీ రామ్ చరణ్ గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్స్ లోను కనిపించడం లేదు. మరి చరణ్ కి ఏమైందో తెలియదు కానీ, మెగా ఫాన్స్ మాత్రం తండ్రి అంత పెద్ద సక్సెస్ సాధించారు.. చరణ్ కూడా ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొంటే ఇంకాస్త జోష్ పెరిగేది అంటున్నారు. రామ్ చరణ్ ఇలా సైలెంట్ గా ఉండడం వాళ్ళకి పెద్దగా నచ్చడం లేదు.