Advertisement
Google Ads BL

మహేష్ తల్లి 11th డే సెర్మనీలో బాలకృష్ణ


మహేష్ బాబు తల్లి, కృష్ణ గారి భార్య ఇందిరగారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్యం కారణంగా కన్ను మూసిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో మహేష్ బాబు ని పరామర్శించి కృష్ణగారిని ఓదార్చడానికి చాలామంది ప్రముఖులు పద్మాలయ స్టూడియోస్ కి వచ్చారు. మెగాస్టార్ చిరు, విజయ్ దేవరకొండ ఇలా చాలామంది వచ్చివెళ్లారు. ఐదో రోజున మహేష్ బాబు అలాగే కృష్ణగారి తమ్ముడు ఆదిశేషగిరి రావు, సుధీర్ బాబులు హరిద్వార్ వెళ్లి ఇందిరాదేవి అస్తికలు గంగానదిలో కలిపి వచ్చారు.

Advertisement
CJ Advs

అయితే మహేష్ బాబు తల్లి మరణించిన టైములో బాలకృష్ణ అందుబాటులో లేరు. దానితో ఆయన కృష్ణగారిని పరామర్శించడానికి వెళ్లలేకపోయారు. అందుకే ఈ రోజు జరిగిన 11 వ రోజు పెద్ద కర్మ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. కృష్ణగారు, మహేష్ బాబు ఇంకా పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బాలకృష్ణ ప్రత్యేకంగా కనిపించారు. అలాగే బాలకృష్ణ మహేష్ బాబు తో మాట్లాడుతున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  

Balakrishna has attended the 11th day ceremony of Indiramma:

Balakrishna has attended the 11th day ceremony of Indiramma and consoled Krishna Mahesh Babu & Family
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs