Advertisement
Google Ads BL

ప్రేమించడానికి టైమ్ లేదంటున్న రష్మిక


టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లోను మోస్ట్ లక్కీయేస్ట్ బ్యూటీగా మారిన రష్మిక మందన్న గుడ్ బై చిత్ర విడుదల తర్వాత రిలాక్సేషన్ కోసం మాల్ దీవులకు వెళ్ళింది. అది కూడా తన ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ తో కలిసి. అంటే విజయ్ దేవరకొండ కి రశ్మికకి మధ్యన ఏదో నడుస్తుంది అనే ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగానే జరుగుతుంది. ఫ్రెండ్స్ అయితే మరీ అంత ఇదిగా ఉండరుగా అనేది నెటిజెన్స్ వాదన. లైగర్ ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ SIIMA అవార్డ్స్ కి మెరవడమే కాదు, మహేష్ బాబు తల్లిగారు మరణించిన రోజు మహేష్ ని పరామర్శించడం, కృష్ణం రాజు గారు మరణించిన రోజు ప్రభాస్ ని పలకరించడం చేసాడు. తర్వాత నిన్న శుక్రవారం ముంబై ఎయిర్ పోర్ట్ లో తేలాడు. అది కూడా రష్మిక తో కలిసి.

Advertisement
CJ Advs

అందుకే రష్మిక ని విజయ్ దేవరకొండ తో డేటింగ్ లో ఉన్నారా అని అడుగుతుంటారు. అయితే ప్రేమించేందుకు టైమ్ లేదు, ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే తానే చెబుతా అంటుంది ఈ నేషనల్ క్రష్. మిమ్మల్ని నేషనల్ క్రష్ అంటారు. మరి మీకు ఎవరిపైన అన్నా క్రష్ ఉందా అని అడిగితె దానికి రష్మిక గమ్మతుగా సమాధానం చెప్పింది. ఇప్పటికే బిజీగా ఉంటూ మమ్మల్ని కలవడం లేదు అంటూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబెర్స్ కంప్లైంట్ చేస్తారు. అదే రిలేషన్ లో ఉంటే వాళ్ళకి చాలా టైమ్ కేటాయించాలి అంతేకాకుండా బంధం నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. ప్రెజెంట్ సినిమాలతో చాలా బిజీ. కానీ ప్రేమించడానికి టైమ్ లేదు. ఒకవేళ రిలేషన్ లో ఉంటే చెబుతా అంటూ సమాధానమిచ్చింది.

Rashmika says she has no time to love:

Rashmika Mandanna about her love life
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs