Advertisement
Google Ads BL

బాలయ్య కొడుకు ‘స్వాతిముత్యం’


నటసింహం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ అరంగేట్రం ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు కళ్లకు ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. బాలయ్యేమో.. అదిగో ఇదిగో అంటున్నారే కానీ.. సరైన క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. అన్నీ కుదిరితే.. ఈ సంవత్సరం మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అంతా భావించారు. కానీ, తన వారసుడిని బరిలోకి దింపేందుకు బాలయ్య ఇంకా ఆలోచిస్తున్నాడు. సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడు. ఇదిలా ఉంటే.. అసలు మోక్షజ్ఞకు సినిమాలలోకి రావాలనే ఇంట్రెస్టే లేదు.. అందుకే ఇంతవరకు ఆయన ఎంట్రీ ఇవ్వలేదనేలా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సరే.. ఆ విషయాలన్నీ పక్కన పెడితే.. దసరా సందర్భంగా విడుదలైన ఓ చిత్రాన్ని చూసేందుకు మోక్షజ్ఞ.. సినిమా థియేటర్‌కు వచ్చాడు. నార్మల్ పర్సన్‌గా, ఎటువంటి హడావుడి లేకుండా.. కామ్‌గా సినిమా చూసి వెళ్లిపోదామని అనుకున్న మోక్షజ్ఞను కొందరు గుర్తించి.. అతనితో ఫొటోలకు ఎగబడ్డారు. 

Advertisement
CJ Advs

 

ఇదంతా ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు‌కి చెందిన ‘AMB Mall’లో. ఇంతకీ మోక్షజ్ఞ చూడడానికి వెళ్లిన చిత్రం ఏమిటని అనుకుంటున్నారా? ఈ పండగకి ‘గాడ్‌ఫాదర్’, ‘ది ఘోస్ట్’, ‘స్వాతిముత్యం’ చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ఓ చిత్రాన్ని మోక్షజ్ఞ చూడడానికి ఏఎమ్‌బి మాల్‌కి వెళ్లాడు. వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. మోక్షజ్ఞ వెళ్లింది ‘స్వాతిముత్యం’ సినిమా చూసేందుకని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసుగా? బెల్లంకొండ గణేష్. వీరిద్దరూ మంచి స్నేహితులని, అందుకే మోక్షజ్ఞ.. ఈ సినిమా చూసేందుకు థియేటర్‌కి వెళ్లాడనేలా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తుంది. 

Mokshagna watches Swathimuthyam at AMB Mall:

Mokshagna at Hyderabad AMB Mall
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs