Advertisement
Google Ads BL

మోహన్ రాజా ఆ తప్పు చేయలేదు


మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా కాంబినేషన్‌లో అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ‘గాడ్‌ఫాదర్’ చిత్రం.. సక్సెస్ ఫుల్ టాక్‌తో థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ చిత్రానికి ఈ చిత్రం రీమేక్ అనే విషయం తెలిసిందే. ఒరిజినల్‌‌కి, రీమేక్‌కి చాలా మార్పులు చేశారు దర్శకుడు మోహన్ రాజా అండ్ టీమ్. వాళ్లు చేసిన మార్పులన్నీ.. ప్రేక్షకులకు నచ్చుతున్నాయి. ఆల్రెడీ ‘లూసిఫర్’ సినిమా చూసి.. ఈ సినిమా చూసిన కొందరైతే.. ఈ సినిమాలో మార్పులు, జస్టిఫికేషన్ చక్కగా ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దర్శకుడు మోహన్ ‌రాజాపై మెగాభిమానులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ఆయన చూపించిన తీరు.. వారికి మాంచి కిక్కిస్తోంది. 

Advertisement
CJ Advs

 

ఇంతకు ముందు చిరంజీవి చేసిన ‘ఆచార్య’ సినిమాకి డైరెక్టర్ కొరటాల చేసిన తప్పు.. మోహన్ రాజా చేయలేదంటూ కొందరు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. ‘పాదఘట్టం’ అంటూ సినిమా అంతా నింపేశాడు తప్ప.. చిరంజీవి, చరణ్‌లకు ఇవ్వాల్సిన ఎలివేషన్స్ ఇవ్వలేదనేది వారి వాదన. ఒక్క ‘చిరుత’ల షాట్ తప్ప.. ఆ సినిమాలో మెగా ఫ్యాన్స్ ప్రౌడ్‌గా ఫీలయ్యే సన్నివేశం లేదనేది వారి ఆవేదన. అయితే మోహన్ రాజా మాత్రం ఆ తప్పు చేయలేదు. ముఖ్యంగా మెగాస్టార్‌కి ప్లస్ అయిన ఆయన కళ్లని మోహన్ రాజా ఒడిసిపట్టిన తీరు.. చిరు కను సైగలతో సినిమా నడిచే సన్నివేశాలు.. ఇది కదా మాకు కావాల్సింది.. అంటూ మెగాభిమానులు అనుకునేలా చేస్తున్నాయంటే.. కచ్చితంగా అది మోహన్ రాజా దర్శకత్వం గొప్పతనమే. వెంటనే ఇంకో సినిమా కూడా మా హీరోతో చేయండి అంటూ.. కోరుతున్నారంటే..‘గాడ్‌ఫాదర్’ వారికి ఎంతగా నచ్చిందీ అనే దానికి ఇది నిదర్శనమే.   

Mohan Raja did not make that mistake:

Mega Fans Happy with Mohan Raja Direction
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs