Advertisement
Google Ads BL

అవకాశాలు ఇవ్వడం లేదంటున్న సురేఖ వాణి


ఒకప్పుడు కేరెక్టర్ ఆర్టిస్ట్ గా కాస్త బిజీగా వున్న సురేఖ వాణి ఇప్పుడు పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. తన కూతురు సుప్రీత తో కలిసి సోషల్ మీడియాలో హడావిడి ఎక్కువైంది. కూతురు తో కలసి డాన్స్ లు చేయడం, బర్త్ డే పార్టీలు ఇలా సురేఖ వాణి హైలెట్ అవుతుంది, అయితే మొన్నామధ్యన సురేఖ వాణి రెండో పెళ్లి మేటర్ బాగా పాపులర్ అయ్యింది. కూతురు సుప్రీత తల్లికి మళ్లీ పెళ్లి చేస్తాను అని చెప్పింది. అటు సురేఖ వాణి కూడా తనకో బాయ్ ఫ్రెండ్ కావాలంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.

Advertisement
CJ Advs

అయితే సురేఖ వాణికి అవకాశాలు తగ్గడం, సినిమాల్లో పెద్దగా కనిపించకపోవడం పై రకరకాల కారణాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆమె పారితోషం పెంచేసింది అని, హీరోయిన్స్ కి అమ్మగా మాత్రమే చేస్తాను అని డిమాండ్ చేస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారం పై సురేఖ వాణి తాజాగా ఓ ప్రెస్ మీట్ లో  స్పందించింది. సినిమాలలో నటించేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని... కానీ తనకు ఎవరూ అవకాశాలను ఇవ్వడం లేదని చెప్పింది. స్వాతిముత్యంలో తనని నమ్మి మంచి కేరెక్టర్ ఇచ్చిన దర్శకుడుకి థాంక్స్ కూడా చెప్పింది. 

Not getting movie offers: Surekha Vani:

Surekha Vani thanks to Swathi Muthyam director
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs