మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మోహన్ రాజా దర్శకత్వంలో దసరా స్పెషల్‌గా వచ్చిన ‘గాడ్‌ఫాదర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయదుంధుబి మోగిస్తోంది. విడుదలైన అన్ని చోట్లా విజయవంతంగా రన్ అవుతోంది. ‘ఆచార్య’ ప్లాప్‌తో ఎన్నో అవమానాలు ఫేస్ చేసిన మెగాభిమానులు ఈ విజయంతో థియేటర్ల వద్దే కాదు.. సోషల్ మీడియాలోనూ కాలరేగరేస్తూ.. మెగాస్టార్‌పై అభిమానం చాటుకుంటున్నారు. కొందరు డై హార్డ్ ఫ్యాన్స్ అయితే బాల్యానికి వెళ్లిపోయి.. ఆనందభాష్పాలతో నీరాజనాలు పడుతున్నారు. మరి అంతా బాగానే ఉంది కదా.. ఫ్యాన్స్ గొడవ ఏమిటని అనుకుంటున్నారా? అంతా బాగానే ఉంటే.. అది మెగాస్టార్ సినిమా ఎందుకవుతుంది? మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మొదలైనప్పటి నుంచి ఎందరో మహామహులను ఆశ్చర్యపరుస్తూ.. టాప్ స్థానం సొంతం చేసుకున్నారు. ఆ స్థానం ఒక్కరోజులోనో.. ఒక్క సినిమాతోనో వచ్చింది కాదు. దీని వెనుక ఎంతో కృషి ఉంది. చిరు నడిచి వచ్చిన దారిలో, నడుస్తున్న దారిలోనూ అడ్డంకులు సృష్టించడానికి ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. ఎందుకంటే ఆయన హీరో కదా.. విలన్ లేకపోతే మజా ఉండదుగా. సరే.. అసలు విషయంలోకి వస్తే.. ఫ్యాన్స్ గొడవకి కారణం థియేటర్లు.
దసరా ఫెస్టివల్, పోటీగా మరో రెండు సినిమాలు ఉండటంతో చాలా చోట్ల థియేటర్ల కొరత ఏర్పడింది. దీంతో ఫ్యాన్స్ కోరుకున్న థియేటర్లలో ‘గాడ్‌ఫాదర్’ సినిమా పడలేదు. చాలా తక్కువ థియేటర్లలోనే ఈ సినిమా విడుదలైంది. ఎందుకంటే, మరోవైపు డిస్ట్రిబ్యూషన్‌లో టాప్ అయిన బ్యానర్‌లో నాగార్జున సినిమా, అగ్ర సంస్థ అయిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో మరో సినిమా విడుదలవడంతో.. అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడు సినిమాలను విడుదల చేశారు. అయితే, ఈ సినిమాల కంటే ముందు విడుదలైన ‘పొన్నియిన్ సెల్వన్ 1’ ఆడుతున్న థియేటర్లను ‘గాడ్‌ఫాదర్’కి కేటాయించాలని మెగాభిమానులు కొందరు రిక్వెస్ట్‌లు పెట్టినా.. ఆ సినిమాని థియేటర్లలో తీసేయడానికి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అంగీకరించలేదనేలా టాక్ నడుస్తుంది. ‘ఆచార్య’ సినిమా టైమ్‌లో కూడా ఆ నిర్మాత తన చిత్రంతో చిరుకి పోటీ ఇవ్వాలని చూశాడు. అందుకు కారణాలు అనేకం. కానీ చివరి నిమిషంలో తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్న ఆ నిర్మాతకు.. ఇప్పుడు ఛాన్స్ రావడంతో.. మెగా ఫ్యాన్స్ రిక్వెస్ట్‌ని అస్సలు పట్టించుకోలేదని.. దీంతో కొందరు అభిమానులు గొడవకు దిగారనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.