బాలీవుడ్ క్యూటీ, బ్యూటీ అలియా భట్ ఈ ఏడాది ప్రేమించిన ప్రియుడి రణబీర్ తో ఏడడుగులు నడిచింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకున్న అలియా భట్ వెంటనే పిల్లల ప్లానింగ్ చేసేసుకుంది. పెళ్ళై మూడు నెలలు తిరక్కుండానే అలియా భాట్ కన్సివ్ అయ్యింది అన్న విషయాన్ని భార్యాభర్తలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకి షేర్ చేసారు. బేబీ బంప్ తోనే డార్లింగ్ ప్రమోషన్స్ లోను, బ్రహ్మాస్త్ర షూటింగ్ లో పాల్గొంది. తనపై ఎన్ని ట్రోల్స్ వస్తున్నా ఈ చిన్నది లెక్క చెయ్యలేదు. నేను హెల్దీగా ఉన్నా సో పని చేసుకుంటాను అని ఖరాఖండిగా చెప్పింది.
ఇక రణబీర్-అలియా భట్ కలిసి నటించిన బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంది అలియా. తాజాగా అలియా భట్ కి అత్తారింట అంగరంగ వైభవంగా సీమంతం జరిగింది. అలియా భట్ సీమంతాన్ని ఆమె తల్లి, అలాగే అత్త నీతూ కపూర్ లు గ్రాండ్ గా నిర్వహించారు. భర్త చేత ఆశీర్వాదం తీసుకున్న అలియా భట్ ఎల్లో కలర్ ఎత్నిక్ వేర్ డ్రెస్ లో మెరిసిపోయింది. అలియా భట్ బేబీ షవర్ ఫంక్షన్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వేడుకలకి కపూర్ ఫ్యామిలీతో పాటుగా అలియా భట్ ఫ్యామిలీ అలాగే ఆమె స్నేహితులు హాజరయ్యారు. ఇంకా అలియా భట్ సీమంతం వేడుకలో రణబీర్ కపూర్ స్పెషల్ గా కనిపించాడు.