Advertisement
Google Ads BL

ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడా?

prabhas,salaar,delhi | ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత కొద్దిరోజులుగా తీరిక లేకుండా గడుపుతున్నారు. గత రెండు నెలలుగా ఆయన మోకాలి ఆపరేషన్ కోసం విదేశాలకు వెళ్లడం, ఆ వెంటనే హైదరాబాద్ కి రావడం, ఇక్కడికి వచ్చాక పెదనాన్న  కృష్ణం రాజుగారి మరణం, ఆయన కి సంబందించిన కార్యక్రమాలు పూర్తి చెయ్యడం, అలాగే ఆదిపురుష్ టీజర్ లాంచ్ కోసం అయోధ్యకి వెళ్లడం, అక్కడినుండి ఈ రోజు ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో జరగబోయే రావణ దహన కార్యక్రమానికి హాజరు కావడం ఇలా చాలా బిజీగా కనబడుతున్నారు. మధ్యలో ప్రశాంత్ నీల్ తో సలార్ షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. అయితే ఇలా వరస షెడ్యూల్స్ తో ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడనిపిస్తుంది. కారణం ఆయన మోకాలి ఆపరేషన్ తర్వాత కొద్దిగా కూడా రెస్ట్ లేకపోవడమే.

Advertisement
CJ Advs

మోకాలి ఆపరేషన్ జరిగిన కొద్ది రోజులకే కృష్ణం రాజు గారు మరణించిన రోజు ఎక్కువగా నించోవడం, తర్వాత మొగల్తూరు, అలాగే అయోధ్య, ఢిల్లీ ట్రావెల్ చెయ్యడం ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాయనిపిస్తుంది. ఆదిపురుష్ టీజర్ లాంచ్ రోజైతే ఆయన దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ సపోర్ట్ తీసుకోవడం అందరికి షాకిచ్చింది. ఆయన నడవడానికి ఇక్కడు ఇబ్బంది పడడంతో ఫాన్స్ ఆందోళన పడుతున్నారు. ఈ పెయిన్ తో ఆయన సినిమా షూటింగ్స్ లో పాల్గొనడం అంత మంచిది కాదు, కానీ ఆయన గత వారమే సలార్ సెట్స్ లోకి వెళ్లిపోయారు. ఇలా పెయిన్ తో పని చేస్తే తర్వాత మరింతగా ఇబ్బంది రావొచ్చు అంటున్నారు. అందుకే ప్రభాస్ రిస్క్ తీసుకోకుండా రెస్ట్ తీసుకుంటే బావుంటుంది అని సలహా కూడా ఇస్తున్నారు.

Is Prabhas taking a risk?:

 Prabhas to be Ravan slayer at Lal Qila
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs