Advertisement
Google Ads BL

గాడ్ ఫాదర్ కి హిట్ టాక్


మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ఈ రోజు దసరా ఫెస్టివల్ సందర్భంగా విడుదలైంది. భారీ అంచనాలు నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ భాగమవడం, లేడీ సూపర్ స్టార్ నయనతార నెగెటివ్ కేరెక్టర్ లో కనిపించడం వంటి అంశాలతో సినిమాపై మంచి క్రేజ్ వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్ లో గాడ్ ఫాదర్ ప్రీమియర్స్ పూర్తి కావడంతో పబ్లిక్ గాడ్ ఫాదర్ సినిమాపై తమ ఒపీనియన్స్ ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. చిరంజీవి కమ్ బ్యాక్ తర్వాత ఆయన కి బెస్ట్ మూవీ గా గాడ్ ఫాదర్ నిలుస్తుంది. ఫాన్స్ కి ఏం కావాలో అవన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. రీమేక్‌ను దర్శకుడు మోహన్ రాజా అద్బుతంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా తెరకెక్కించారు. ఈ సినిమా క్రెడిట్ అంతా మోహన్ రాజాకే దక్కుతుంది. అంతేకాకుండా తమన్ బీజీఎం సూపర్‌గా ఉంది అంటూ ఓవర్సీస్ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

గాడ్ ఫాదర్ ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది అంటున్నారు. సెకండాఫ్ డీసెంట్. ఓవరాల్‌గా మెగా ఫాన్స్ కి మెగాస్టార్ హిట్ సినిమా అందించారు. చిరంజీవి స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. కొన్ని సీన్లలో చిరు కళ్లతోనే నటించాడు. గాడ్‌ఫాదర్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. నిజాయితీగా తీసిన రీమేక్. కొన్ని సీన్లు కొత్తగా అనిపించాయి. కథలోని ఆత్మను తీసుకొని చాలా మార్పులు చేసి.. ఎంగేజింగ్‌గా మార్చారు. లూసిఫ‌ర్ కోర్ పాయింట్‌ను మార్చ‌కుండా గాడ్‌ఫాద‌ర్‌ లో చేసిన మార్పులు చేర్పులు ఆడియెన్స్‌ని ఎంగేజ్ చేస్తున్నాయ‌ని, ఫైట్స్‌, పంచ్ డైలాగ్స్‌, ప్రీ ఇంట‌ర్వెల్‌, ఇంట‌ర్వెల్‌లో స‌ల్మాన్ భాయ్ ఎంట్రీ, డ‌ల్ మూమెంట్ క‌న‌ప‌డ‌లేదు.. అంటూ ఓవర్సీస్ ప్రేక్షకుల ఇచ్చిన టాక్ తో మెగా ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ దసరా మనదే అంటూ రెచ్చిపోతున్నారు.

Godfather Overseas Talk:

Megastar Godfather Public Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs