Advertisement
Google Ads BL

ఆదిపురుష్ కి కూడా బ్యాన్, బాయ్ కాట్ సెగ


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయ్యేంతవరకు ఆరాటపడిపోయిన ప్రభాస్ ఫాన్స్ టీజర్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియా లో వచ్చే నెగిటివిటీని చూసి నీరసపడిపోయారు. ఆదిపురుష్ టీజర్ యూట్యూబ్ లో రికార్డ్స్ కొల్లగొడుతుంటే.. టీజర్ పై అంతే నెగెటివ్ ట్రోల్స్ ట్రెండ్ అవడం ఫాన్స్ కి మింగుడు పడడం లేదు. సోషల్ మీడియాలో ట్రోల్స్ కి అంతేలేకుండా పోయింది. ఇక ఈ రోజు అక్టోబర్ 4 మంగళవారం ఉదయం నుండి #BoyCottAdipurush, #BanAdipurush హాష్ టాగ్స్ ట్విట్టర్ లో ట్రేండింగ్ లోకి వచ్చాయి. బాలీవుడ్ కి టచ్ ఉన్న ప్రతి సినిమాకి ఈ బాయ్ కాట్ సెగ తప్పడం లేదు. 

Advertisement
CJ Advs

కరణ్ జోహార్ తో లింక్ అయ్యారని లైగర్ ని ట్రోల్ చెయ్యడమే కాదు, #BoyCottLiger హాష్ టాగ్ ట్రెండ్ చేసారు. గత కొద్ది రోజులుగా #BoyCottBollywood హాష్ టాగ్స్ అనేవి రొటీన్ గా మారాయి. అక్కడ సినిమా రిలీజ్ అవుతుంది అంటే వాటిపై నెటిజెన్స్ నెగిటివిటీని హాష్ టాగ్స్ రూపం లో చూపిస్తున్నారు. తాజాగా ప్రభాస్ ఆదిపురుష్ డైరెక్టర్ బాలీవుడ్ వాడు కావడం, అలాగే ఎక్కువమంది నటులు బాలీవుడ్ వాళ్లే కావడంతో నెటిజెన్స్ ఆదిపురుష్ ని కూడా వదల్లేదు. అందుకే #BoyCottAdipurush, #BanAdipurush హాష్ టాగ్స్ ని ట్రెండ్ చేస్తూ హంగామా చేస్తున్నారు. ఆఖరికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ కి ఈ బ్యాన్, బాయ్ కాట్ సెగ తప్పలేదు.

BoyCottAdipurush, BanAdipurush hashtags trends on Twitter:

Prabhas Adipurush faces massive trolls on social media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs