అల్లు కాంపౌండ్ లో బాలకృష్ణ అంటేనే అందరూ షాకైపోయారు. కానీ ఇప్పుడు అదే అల్లు కంపౌండ్, బాలయ్య అడ్డా అన్ స్టాపబుల్ షో లో చంద్రబాబు నాయుడు అంటే షేకైపోవడం ఖాయం. బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా చంద్రబాబు రాబోతున్నారు కాదు వచ్చేసారు. ప్రస్తుతం ఆ ఎపిసోడ్ కి సంబందించిన షూటింగ్ పిక్స్ సోషల్ మీడియాలో లీకై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. బాలయ్య షోకి బావ చంద్రబాబు గెస్ట్ వినడానికే వినసొంపుగా ఉంటే.. చూడడానికి రెండు కళ్ళూ చాలవేమో. చంద్రబాబు బాలయ్య టాక్ షో కి వెళుతున్నారని తెలిసి తెలుగు తమ్ముళ్లు ఆనందం ఆపుకోలేకపోతున్నారు.
ఆహా అన్ స్టాపబుల్ షూటింగ్ సెట్స్‌లో చంద్రబాబుతో బాలకృష్ణ ఉన్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ షోకి చంద్రబాబుతో పాటు ఆయన కొడుకు, బాలయ్య అల్లుడు నారా లోకేశ్ కూడా పాల్గొంటున్నారని సమాచారం. మరి ఈ ఎపిసోడ్ లో చంద్రబాబుకి బాలయ్య సందించబోయే ప్రశ్నలేమిటో.. బాబుగారూ ఆ ప్రశ్నలకి ఎలా స్పందిస్తారో అనే క్యూరియాసిటీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ ప్రేమికులకు మొదలైపోయింది. నిజంగా బాలయ్య-చంద్రబాబు ఒకే స్టేజ్ పై ఇది కదా మజా అంటే అంటున్నారు. నేడు విజయవాడలో సీజన్ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని వేలాది అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించబోతుంది ఆహా టీం.