యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంకా స్లీప్ మోడ్ లోనే ఉన్నారు. కొరటాలతో చెయ్యబోయే మూవీ జూన్ అన్నారు, దసరా అన్నారు. జూన్ వచ్చింది వెళ్ళింది, దసరా వచ్చింది వెళుతుంది. కానీ NTR30 మేటర్ మాత్రం బయటికి రావడం లేదు. ఎన్టీఆర్ కొరటాలతో మీట్ అయ్యి కథ విషయంలో మార్పులు చేర్పులు చెబుతన్నాడని అంటున్నారు. పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్ కి మించి ఉండేలా కథని సిద్ధం చేస్తున్నారు అంటూ నిర్మాత కళ్యాణ్ రామ్ చెప్పారు. తాజాగా ఎన్టీఆర్ కొరటాలని కలిసి క్లైమాక్స్ లో మార్పులు చెప్పాడని, టైం తీసుకుని మరీ కథని పర్ఫెక్ట్ గా రెడీ చెయ్యమన్నాడు అని అంటున్నారు.
కానీ అంతకుమించి NTR30 విషయంలో ఏదో జరుగతుంది.. అదేమిటో క్లారిటీ లేక ఫాన్స్ తెగ ఇదై పోతున్నారు. మిగతా హీరోలంతా సెట్స్ మీద హడావిడి చేస్తున్నా ఎన్టీఆర్ మాత్రం కామ్ గా ఉండడం ఫాన్స్ కి కునుకురానివ్వడం లేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం NTR30 మీదే ఫోకస్ పెట్టి ఫుల్ గా మేకోవర్ అవుతున్నాడట. అలాగే హీరోయిన్ గా కియారా అద్వానీ విషయంలోనూ త్వరలోనే ఓ క్లారిటీ రాబోతుంది అని, దానితో NTR30 ని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసి వెంటనే రెగ్యులర్ షూట్ కి వెళతారని తెలుస్తుంది.