మా ఎలెక్షన్న్స్ టైం లోనే కాదు, చాలా విషయాల్లో నటి హేమ కాంట్రవర్సీలని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ నటి బిగ్ బాస్ లోకి వెళ్లి మొదటివారమే ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది. అయితే తాజాగా హేమ మరోసారి వార్తల్లో నిలిచింది. నిన్న సోమవారం హేమ విజయవాడ కనకదుర్గ దర్శనానికి వెళ్ళింది. దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడుతూ అసలు దుర్గమ్మ దర్శనం చేసుకుంటానా అనిపించింది, అంతమంది జనం అమ్మవారి దర్శనానికి వచ్చారు, టివిలో దుర్గమ్మ దర్శనం కష్టమవుతుంది, ప్రోటోకాల్ ఇబ్బందులు ఉన్నాయని విన్నాను. కానీ చివరి నిమిషంలో అమ్మవారు నన్ను పిలిచింది. వచ్చి దర్శనం చేసుకున్నాను అంటూ మాట్లాడుతున్న సమయంలోనే ఓ రిపోర్టర్ మీరు ఎంతమంది వచ్చారు. టికెట్ కొనుక్కునే దర్శనానికి వెళ్ళారా అని ప్రశ్నించాడు.
దానితో హేమ ఆ రిపోర్టర్ పై కస్సున లేచింది. ఏంటి దీనిని కూడా వివాదం చేస్తారా.. ఇద్దరం వచ్చాం, అమ్మవారి హుండీలో తాను 10 వేలు వేశాను, 20 వేల విలువైన చీరను సమర్పించాను, అలాంటిది టికెట్ కొనుక్కుని రాలేమా, టికెట్ తీసుకున్నామని, ప్రొటోకాల్ ప్రకారమే దర్శనానికి వెళ్లామని చెప్పిన హేమ తాను దుర్గమ్మ భక్తురాలినని, అమ్మవారి ఆశీస్సుల కోసమే ఇక్కడికి వచ్చానని, వివాదం సృష్టించేందుకు రాలేదంటూ కాస్త ఘాటుగానే చెప్పింది.