Advertisement
Google Ads BL

ప్రభాస్-కృతి: సమ్ థింగ్ కాదు.. ఏదో ఉంది


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్, ఆదిపురుష్ జానకి తో డేటింగ్ లో ఉన్నాడనే న్యూస్ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ప్రభాస్ 40 ప్లస్ వచ్చిన ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెదనాన్న కృష్ణంరాజు గారు ప్రభాస్ కి పెళ్లి చెయ్యాలనే కోరికతోనే ఉన్నారు. కానీ ఆయన అర్ధాంతరంగా కన్నుమూయడంతో ఆయన కోరిక తీరనే లేదు. అయితే ప్రభాస్ హీరోయిన్ అనుష్క తో ప్రేమలో ఉన్నాడని, ఆమెని వివాహం చేసుకోవడానికి సిద్దపడ్డాడనే వార్తలు కూడా వచ్చాయి. ప్రభాస్-అనుష్క ఇద్దరూ అవన్నీ రూమర్స్ మేము ఫ్రెండ్స్ అని కొట్టిపారేశారు. ఇప్పుడు ప్రభాస్ కృతి సనన్ తో డీప్ లవ్ లో ఉన్నాడంటున్నారు.

Advertisement
CJ Advs

రీసెంట్ గా అయోధ్యలో జరిగిన ఆదిపురుష్ టీజర్ రోజున ప్రభాస్ చమట తుడుచుకోవడానికి కృతి సనన్ చున్నీ ఇవ్వడం, ప్రభాస్ కాలుకి జరిగిన సర్జరీ వలన కాస్త ఇబ్బంది పడడంతో అతను నడవడానికి కృతి సనన్ సహాయం చెయ్యడం ఇవన్నీ చూస్తుంటే వీరి మధ్యన బాండింగ్ గట్టిగానే ఉంది, అటు ఆదిపురుష్ లోను ప్రభాస్ - కృతి సనన్ కెమిస్ట్రీ సూపర్ అంటున్నారు. ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్ లోను కృతి సనన్ ఎక్కువగా ప్రభాస్ ని చూడడం, ఈ జంట ఆఫ్‌ స్క్రీన్ కెమిస్ట్రీ మరింత అదరిపోయిందంటూ ఫాన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి నిజంగానే ప్రభాస్-కృతి సనన్ మధ్యన సం థింగ్ సం థింగ్ ఎమన్నా ఉందా? లేదంటే ఇది జస్ట్ రూమరా.. అనేది తెలియాల్సి ఉంది.

Are Kriti Sanon and Prabhas dating? :

Prabhas And Kriti Sanon Walk Hand-In-Hand At Adipurush teaser launch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs