Advertisement
Google Ads BL

పూజ సర్జరీ, మేనేజర్ క్లారిటీ


టాప్ హీరోయిన్ గా టాప్ చైర్ కి దగ్గరైన పూజ హెగ్డే కి ఈ ఏడాది మూడు ప్లాప్ లు దిమ్మ తిరిగేలా చేసాయి. రోజుకు మూడు షిఫ్ట్ లతో కష్టపడుతూ పరుగులు పెట్టిన పూజ హెగ్డే ఇప్పుడు రెండు మూడు సినిమాలతో కొద్దిగా బిజీగా కనబడుతుంది. ఈ ఏడాది పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ ప్లాప్, ఆచార్య ప్లాప్, బీస్ట్ ప్లాప్ లతో అమ్మడు విలవిల్లాడింది. అయినప్పటికీ మహేష్ బాబు-త్రివిక్రమ్ క్రేజీ SSMB28 లో హీరోయిన్ గా సందడి చేయబోతుంది. బాలీవుడ్ లోను రణ్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. అయితే బుట్టబొమ్మ పూజ హెగ్డే అందాలు పెంచుకోవడానికి జిమ్ లో నిత్యం వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది. 

Advertisement
CJ Advs

తాజాగా పూజ హెగ్డే ఓ బాడీ పార్ట్ కి సర్జరీ చేయించుకుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. తన అందాలను మరింతగా మెరుగు పరుచుకునేందుకు పూజ హెగ్డే తన ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అంటూ ప్రచారం జరిగింది. అందుకే పూజ హెగ్డే ప్రస్తుతం విదేశాల్లో ఉంది అని కూడా అంటున్నారు. అయితే ఈ ప్రచారానికి పూజ హెగ్డే మేనేజర్ అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. పూజ హెగ్డే కేవలం వెకేషన్స్ కోసం మాత్రమే విదేశాలకు వెళ్ళింది అని, ఆమె ఎలాంటి సర్జరీ చేయించుకోవడం లేదు, పూజ ముక్కు సర్జరీ పై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు అంటూ కొట్టిపారేశాడు.

Pooja Hegde And Her Team Rubbish The Rumors Of Cosmetic Surgery:

 Actress Pooja Hegde Nose Surgery Rumors Viral Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs