Advertisement
Google Ads BL

ప్రభాస్-మారుతి కథ మారిందా?


ప్రభాస్ ఇప్పుడు చాలా బిజీగా వున్నారు. కాలికి సర్జరీ అయిన తర్వాత సలార్ షూటింగ్ లో జాయిన్ అయ్యే టైం లో పెదనాన్న కృష్ణ రాజు గారు మరణించడం, ఆయన దశదిన కర్మ పూర్తయిన వెంటనే సలార్ షూటింగ్ లోకి వెళ్లడం, ఆ తర్వాత మళ్లీ కృష్ణంరాజు గారి సంస్మరణ సభకి మొగల్తూరు వెళ్లడం, అది పూర్తయిన వెంటనే అయోధ్య కి ఆదిపురుష్ టీజర్ లాంచ్ కి హాజరవడం ఇలా ప్రభాస్ బిజీ షెడ్యూల్ మెయింటింగ్ చేస్తున్నారు. అక్టోబర్ నుండి కానీ నవంబర్ నుండి కానీ ప్రభాస్ మారుతి తో చెయ్యబోయే చిత్రం రెగ్యులర్ షూట్ మొదలుకావాల్సి ఉంది. అయితే ప్రభాస్ మారుతి తో సినిమా చెయ్యడమే ప్రభాస్ ఫాన్స్ కి ససేమిరా నచ్చడం లేదు. 

Advertisement
CJ Advs

మారుతీ డైరెక్షన్ లో ప్రభాస్ ఓ హార‌ర్ కామెడీ క‌థ తో సినిమా చేయబోతున్నది, అని టైటిల్ గా రాజా డీలక్స్ కూడా పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మారుతి ప్రభాస్ తో చేస్తున్న కథలో మార్పులు చేస్తున్నాడని, హర్రర్ కామెడీ ప్లేస్ లోకి  ఓ క్రైమ్ కామెడీ తీసుకురాబోతున్నాడని వినికిడి. ఈకథ సాహో లో బ్లాక్ బాక్స్ చుట్టూ తిరిగినట్టుగా ఇక్కడ వ‌జ్రాల దోపిడీ నేప‌థ్యంలో సాగుతుంద‌ని తెలుస్తుంది. కథని పర్ఫెక్ట్ గా లైన్ లోకి తెచ్చాకే రెగ్యులర్ షూట్ కి వెళతారని తెలుస్తుంది. మరోపక్క ప్రభాస్ కాలికి చేయించుకున్న సర్జరీ కారణంగా కాస్త ఇబ్బందిపడుతున్నట్టుగా ఆదిపురుష్ టీజర్ లంచ్ రోజు ఆయనకి సపోర్ట్ గా ఓం రౌత్, కృతి సనన్ లు ఉండడం చూసిన వాళ్ళకి అర్ధమైపోతుంది. ఆయన రెస్ట్ తక్కువ తీసుకోవడం వల్లనే అలా పెయిన్ తో ఇబ్బందిపడుతున్నట్లుగా తెలుస్తుంది.

Prabhas.. the whole story has changed?:

Prabhas-Maruti combo story revealed 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs