Advertisement
Google Ads BL

త్రివిక్రమ్ ని తిట్టాను.. ఒప్పుకున్న బండ్ల గణేష్


బండ్ల గణేష్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బిజీగా వుండే వ్యక్తి. ఆయన రామ్ గోపాల్ తర్వాత కాంట్రవర్సీలకి పెట్టింది పేరులా తయారయ్యాడు. పవన్ నామ జపం చేసే బండ్ల గణేష్ ఒక్కోసారి పవన్ పైనే సెటైర్స్ వేస్తుంటాడు. పవన్ కళ్యాణ్ ని దేవుడు, రాముడు అంటూ కొలుస్తాడు. అయితే పవన్ కళ్యాణ్ ఫంక్షన్స్ కి వెళ్లి అక్కడ పవన్ ఫాన్స్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ సైతం ఆశ్చర్యపోయేలా స్పీచ్ ఇవ్వడం వకీల్ సాబ్ ఈవెంట్ అప్పుడు చూసాం. వకీల్ సాబ్ లో ఈవెంట్ లో పేరు రావడం, తన స్పీచ్ తనకే హైలెట్ అనిపించి బండ్ల గణేష్ పవన్ నెక్స్ట్ మూవీ భీమ్లా నాయక్ కి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాడు.

Advertisement
CJ Advs

భీమ్లా నాయక్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ని పొగిడేయ్యాలనే కసితో వెయిట్ చేసాడు. కానీ త్రివిక్రమ్ బండ్ల గణేష్ ని రాకుండా అడ్డుపడ్డాడనే అక్కసుతో ఆయన్ని ఫోన్ లో పిచ్చ తిట్లు తిట్టిన ఆడియో ఒకటి లీకై సెన్సేషన్ క్రియేట్ చేసింది. బండ్ల గణేష్ వేరే వాళ్లకి ఫోన్ చేసి తనని కావాలనే ఈ ఈవెంట్ కి త్రివిక్రమ్ రానివ్వలేదు, వాడు, వీడు, ఇంటికెళ్లి కొడతా అంటూ రెచ్చిపోయి మాట్లాడాడు. కానీ బండ్ల గణేష్ మాత్రం ఆడియో లో ఉన్న వాయిస్ మాత్రం తనది కాదు అంటూ ప్లేట్ తిప్పేసాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అప్పుడు త్రివిక్రమ్ ని తిట్టింది నేనే. ఆ కోపంలో ఆయన్ని తిట్టేసాను. తర్వాత ఆయనికి సారి చెప్పాను, ఆ లీకైన ఆడియో వాయిస్ నాదే అంటూ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఎప్పుడూ అబద్దాలు మాట్లాడే బండ్లన్న ఇప్పుడు నిజం చెప్పడం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి.

I Abused Trivikram: Bandla Ganesh:

Bandla Ganesh: I was the one who scolded Trivikram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs