కరోనా తో ఒకరికి ఒకరు సంబంధాలు లేకుండా ఎక్కడి వారు అక్కడే ఉండిపోయి.. కనీసం పక్కింటి వారిని కూడా పలకరించే పరిస్థితి లేకుండా పోయింది. కొంతమంది తల్లితండ్రులకి దూరంగా ఉండేవారు కోవిడ్ టైం లో కలిసి ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ లు చేసుకున్నవారు ఉన్నారు. కొంతమందికి కోవిడ్ పీరియడ్ చాలా కష్టంగా గడిచింది అనే చెప్పాలి. కానీ మంత్రి రోజా మాత్రం తనకి తన ఫ్యామిలీకి కోవిడ్ పీరియడ్ అనేది హ్యాపీయెస్ట్ పీరియడ్ అంటుంది. రాజకీయాలతో, జబర్దస్త్ షూటింగ్స్ తో బిజీగా వుండే రోజాకి మంత్రి పదవి రాగానే జబర్దస్త్ కి బై బై చెప్పేసింది. జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన తర్వాత మళ్ళీ చాలా రోజులకి ఈటీవీలో దసరా ఈవెంట్ లో ప్రత్యక్షమైంది రోజా.
రోజాపై యోధ వాళ్ళు ఓ స్కిట్ చేసారు. దానితో రోజా బాగా ఎమోషనల్ గా మారింది. అంటే తన పిల్లలకి అన్నం కూడా తినిపించుకోలేని బిజీతో రోజా ఉండడం, రాజకీయాల్లో సీరియస్ గా ఉండాలి కానీ జబర్దస్త్ కామెడీ చేస్తుంది.. అంటూ కామెంట్స్ ని భరించడం, ప్రజల కోసం చాలా కష్టపడుతున్నావు.. మాతో కొంచెం టైం స్పెండ్ చెయ్యమని తన పిల్లలు ఆమెని అడిగినట్టుగా ఇలా ఆ స్కిట్ లో పిల్లలు మాట్లాడడంతో రోజా చాలా ఫీలైపోయింది. ఆమె స్టేజ్ పై కన్నీళ్లు పర్యంతమవడమే కాదు.. ఏ పిల్లలకైనా తల్లి చేతితో అన్నం తినాలని ఉంటుంది.. కానీ నా పిల్లలు అలా కాదు.. అయితే కోవిడ్ టైం ఎవరికి ఎంత కష్టంగా ఉన్నా నా ఫ్యామిలీకి నాకు చాలా హ్యాపీయెస్ట్ పీరియడ్.. మేమంతా కలిసి ఉండేలా హ్యాపీగా ఉండేలా చేసింది అంటూ రోజా స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న ప్రోమో వైరల్ గా మారింది.