Advertisement
Google Ads BL

యాంకర్ శివ పై బిగ్ బాస్ ఆరోహి ఫైర్


బిగ్ బాస్ సీజన్ 6 లోకి సామాన్యమైన కంటెస్టెంట్ గా అడుగుపెట్టి.. హౌస్ లో తనకంటూ ఓ ప్రత్యేకతని చాటేందుకు ప్రయత్నం చేస్తున్న టైం లోనే ఆరోహి రావు ఎలిమినేట్ అవడం అనేది ఆమెకు బయట సపోర్ట్ తక్కువగా ఉండడమే ప్రధాన కారణంగా కనబడుతుంది. లేదంటే ఆరోహి రావు కన్నా హౌస్ లో టాస్క్ పరంగా వీక్ గా ఉన్నారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా కీర్తి, అర్జున్, వాసంతిలు.. సీరియల్ ఆర్టిస్ట్ లు కావడంతో బుల్లితెర ప్రేక్షకులకి తెలిసిన వారు కావడంతో సేవ్ అయ్యారనే ఉద్దేశ్యం చాలామందిలో ఉంది. ఏదో ఒకరోజు తప్పుకుండా వారు ఎలిమినేట్ అవ్వాల్సిందే.  కాకపోతే ఒకరు ముందు ఒకరు వెనుక అంతే.

Advertisement
CJ Advs

అయితే హౌస్ నుండి నాలుగో వారం ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చిన ఆరోహి రావు ని BB బజ్ లో యాంకర్ శివ ఇంటర్వ్యూ చేసాడు. హౌస్ లో ఎలా అనిపించింది అనగానే కొందరితో కనెక్ట్ అయ్యాననిపించింది. ఎవరితో ఎక్కువ కనెక్ట్ అయ్యావ్ అని శివ అడగ్గానే కీర్తి, శ్రీహన్ లతో ఎక్కువగా కనెక్ట్ అయ్యా అంది ఆరోహి. మొదట రెండు వారాల్లో ఇండివిడ్యువల్ గేమ్ ఆడినప్పుడు నీ గ్రాఫ్ బావుంది.. కానీ ఎప్పుడైతే గ్రూప్ లోకొచ్చావో నీ గ్రాఫ్ పడిపోయింది అన్నాడు శివ. కానీ దానికి నేను ఒప్పుకోను అంది ఆరోహి. ఒప్పుకోకపోతే నువ్ నా ముందు ఎందుకుంటావ్ అన్నాడు శివ. అలాగే సూర్య తో హగ్గులు, ముద్దులు వర్కౌట్ అవ్వలేదేమో.. మరీ మితి మీరినట్టుగా కనిపించడంతో ప్రేక్షకులు బయటికి పంపేసారేమో అన్నాడు శివ. మాది ప్యూర్ ఫ్రెండ్ షిప్, పచ్చకామెర్లు ఉన్నోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తే నేనేం చెయ్యలేను అని అనడమే కాదు.. ఇంటర్వ్యూ అని చెప్పి ఇవన్నీ అడిగితే అందరిలా నేను ఊరుకోను అంటూ శివపై ఆరోహి ఫైర్ అయ్యింది.

Arohi Rao fires on Anchor Shiva:

Eliminated contestant Arohi Rao strong warning to Anchor Shiva
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs