బిగ్ బాస్ సీజన్ 4 లోకి జంటగా అడుగుపట్టిన వరుణ్ సందేశ్-వితిక సెరులు విడివిడిగానే ఆడారు.. విడివిడిగానే నామినేట్ అయ్యారు, ఎలిమినేట్ కూడా అయ్యారు. కాని సీజన్ సిక్స్ లోకి జంటగా అడుగుపెట్టిన రోహిత్ అండ్ మరీనాలు మాత్రం జంటగా ఒకే కంటెస్టెంట్ గా ఆడుతున్నారు. నాలుగు వారాలుగా ఇద్దరూ ఒకే కంటెస్టెంట్స్ గా ఆడారు, ఓడారు. నామినేట్ అయ్యారు. కానీ సీజన్ 5 నామినేషన్స్ కోసం బిగ్ బాస్ జంటగా ఉన్న ఇద్దరినీ విడగొట్టేసాడు. రోహిత్ అండ్ మరీనాలని ఒక్కరిని కాకుండా ఇద్దరిని చూపించారు. అంటే హౌస్ లో ఎవరో ఒకరే ఉండాలంటూ నామినేట్ చేయించారు. అందులో భాగంగానే మరీనాకి రోహిత్ కి హ్యాండ్ కప్స్ వేసి నామినేషన్స్ లో నించోబెట్టగా.. నువ్ ఉండాలి, గేమ్ ఆడాలి అంటూ మరీనా రోహిత్ ని ఉంచి తనని తాను నామినేట్ చేసుకుంది.
తర్వాత సుదీప-వాసంతి కలిపి హ్యాండ్ కప్స్ వెయ్యగా.. సుదీప గత వారం నామినేషన్స్ భారం మోసా.. ఈసారి నాకు రిలీఫ్ ఇవ్వు అనగానే వాసంతి నాకు ఇవ్వు నేను ప్రూవ్ చేసుకుంటా అంది.. ఇదేం కాఫీ కాదురా ఇవ్వడానికి అనగానే వాసంతి విసురుగా హ్యాండ్ కప్ తీసేసి వెళ్ళిపోయింది. తర్వాత లవ్ ట్రాక్ నడిపిస్తున్న సత్య-అర్జున్ కళ్యాణ్ లకి హ్యాండ్ కప్స్ వేశారు. నీ కోసం త్యాగం చేశా అంటూ అర్జున్ అంటే.. ఎవరు చెయ్యమన్నారు, నేను నీకు పని చేశా నువ్ నాకు టిప్ ఇచ్చావ్ అంది సత్య.. ఆ తర్వాత ఎనిమీస్ అయిన ఇనాయ-శ్రీహన్ లకి హ్యాండ్ కప్స్ వేశారు.
దానితో శ్రీహన్-ఇనయనాలు గొడవపడ్డారు. కనీసం ఫ్రెండ్స్ మధ్యలో అయినా పెట్టాల్సింది బిగ్ బాస్ ఈ నామినేషన్ అంది ఇనాయ. నువ్ నా ఫ్రెండ్ వే అన్నాడు శ్రీహన్. ఫ్రెండ్ అంటే ఇలా చెయ్యరు. అయినా ఇప్పుడు నువ్ ఫ్రెండ్ అంటున్నావ్. కానీ నేను నామిషన్స్ లోకి వెళ్తా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అంటూ విసురుగా వెళ్ళింది ఇనాయ. ఈరోజు నామినేషన్స్ హీట్ మరోసారి హౌస్ లో కనిపించింది.