Advertisement
Google Ads BL

ఏదో అనుకుంటే ఇంకేందో అయ్యిందే


ఆదిపురుష్ ఆదిపురుష్ అన్నంతసేపు లేదు ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయ్యాక ట్రోల్ అవ్వడానికి. బాహుబలి లాంటి కటౌట్ తో ఆదిపురుష్ రాముడిని చూసుకుందామంటే.. యానిమేషన్ బొమ్మలని చూపించారంటూ ఫాన్స్ డిస్పాయింట్ అవుతుంటే.. యాంటీ ఫాన్స్ కి మంచి ఛాన్స్ దొరికింది ట్రోల్ చెయ్యడానికి. అసలే టాలీవుడ్ సినిమాలపై గుర్రుమీదున్న బాలీవుడ్ క్రిటిక్స్ కి, తమిళ్ క్రిటిక్స్ కి ఛాన్స్ దొరికింది.. దానితో రెచ్చిపోయారు. ఆదిపురుష్ టీజర్ చూసాక ఆడియన్స్ ఫీలింగ్ అంటూ రకరకాల వీడియోస్ ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్  చెయ్యడం మొదలు పెట్టారు. #disappointed #DisappointingAdipurish హాష్ టాగ్స్ తో రచ్చ స్టార్ట్ చేసారు.

Advertisement
CJ Advs

ఆదిపురుష్ టీజర్ వచ్చేస్తుంది.. ఈ దసరా మాదే.. అధర్మంపై ధర్మం గెలుస్తుంది.. ఈ దసరాకి ఆదిపురుష్ ని ట్రెండ్ చేస్తూ రచ్చ రచ్చ చెయ్యాలని కలలు కన్న ప్రభాస్ ఫాన్స్ కి ఈ ట్రోల్స్ దిమ్మతిరిగేలా చేస్తున్నాయి. ఆదిపురుష్ టీజర్ తర్వాత వస్తున్న ట్రోల్స్ ని డిఫెండ్ చేసుకోలేక సతమతమవుతున్నారు. ఎందుకంటే వారు కూడా అదే డిస్పాయింట్ మోడ్ లో ఉన్నారు కాబట్టి. పిల్లల పోగో ఛానల్ లా ఉంది.. బుల్లితెర పై వచ్చే యానిమేటెడ్ బొమ్మల్లా ప్రభాస్ కదలడం చూసి ప్రభాస్ ఫాన్స్ కూడా లబో దిబో అంటూ ఓం రౌత్ ని ఆడుకుంటున్నారు. ఆదిపురుష్ అప్ డేట్ కోసం ఎదురు చూసినంతసేపు లేదు.. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అంటూ వాళ్ళు కాలుకాలిన పిల్లి మాదిరి తిరుగుతున్నారు.

DisappointedAdipurush hashtag trends on twitter:

Hashtags against Adipurush trend on Twitter
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs