Advertisement
Google Ads BL

ఆసక్తిని రేకెత్తిస్తున్న హంట్ టీజర్


అనగనగా ఓ పోలీస్...

Advertisement
CJ Advs

అతని పేరు అర్జున్!

సిక్స్ ప్యాక్ బాడీ...

స్టైలిష్ యాటిట్యూడ్...

ఎక్స్‌ట్రాడిన‌రీ ఫైటింగ్ స్కిల్స్... 

అన్నిటికీ మించి ధైర్య సాహసాలు...

అర్జున్ అంటే ఐకానిక్ పోలీస్ అన్నమాట!

అయితే... ఇక్కడ ఒక ట్విస్ట్ ఉండండోయ్!!

అర్జున్‌లో ఇద్దరు ఉన్నారు! ఒకరు ఎ, మరొకరు బి అనుకుంటే... అర్జున్ ఎ కి తెలిసిన మనుషులు, ఇన్సిడెంట్స్, పర్సనల్ లైఫ్ ఏదీ అర్జున్ బి కి తెలియదు. వేర్వేరు మనుషులు అన్నట్టు! అయితే... అర్జున్ ఎకి తెలిసిన భాషలు, స్కిల్స్, పోలీస్ ట్రైనింగ్ అర్జున్ బి లో ఉన్నాయి. అర్జున్ ఎ గా ఉండటమే అర్జున్‌కు ఇష్టం! అతని కోరిక నెరవేరిందా? అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయినా కేసు ఏమిటి? అనేది హంట్ సినిమాలో చూడాలి.

సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా హంట్. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, ప్రేమిస్తే ఫేమ్ భరత్ ప్రధాన పాత్రలు పోషించారు. నేపథ్యంలో రూపొందుతోన్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.

హంట్ టీజర్ యాక్షన్ ప్యాక్డ్‌గా కట్ చేశారు. సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సుధీర్ బాబు నటనకు తోడు సిక్స్ ప్యాక్ కూడా ఆట్టుకునేలా ఉంది. తను ఎలా చనిపోయాడో తెలుసుకునే ప్రాసెస్‌లో ఎవరు ఎఫెక్ట్ అయినా... ఎంత ఎఫెక్ట్ అయినా... నన్ను ఎవరూ ఆపలేరు అని టీజర్ చివరలో సుధీర్ బాబు చెప్పే డైలాగ్ మరింత క్యూరియాసిటీ పెంచింది.  

సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, ప్రేమిస్తే భరత్ సైతం ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్లుగా నటిస్తున్న చిత్రమిది. 

Hunt Teaser review:

Sudheer Babu Hunt Teaser released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs