Advertisement
Google Ads BL

బోర్ కొట్టించిన బిగ్ బాస్


బిగ్ బాస్ సీజన్ 6 మొదలైయ్యాక హౌస్ లో వారి ఉన్న పేర్లు తెలియని కంటెస్టెంట్స్ ని చూసిన బుల్లితెర ప్రేక్షకులు పెదవి విరిచారు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు సోషల్ మీడియాకి టచ్ ఉన్నవారికి మాత్రమే బిగ్ బాస్ 6 లోకి వచ్చిన కంటెస్టెంట్స్ అంతో ఇంతో తెలుసు. అయితే సీజన్ 6 మొదలైనప్పటికీ.. కొంతమంది కంటెస్టెంట్స్ తమ గురించి ఆడియన్స్ కి రిజిస్టర్ అయ్యేలా గొడవలు పడుతున్నారు. అందులో గీతు, ఆరోహిలు కూడా ఉన్నారు. అయితే గత నాలుగు వారాలుగా ఏదో నత్తనడకన నడుస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు మరింత డల్ గా మారింది. దసరా స్పెషల్ ఎపిసోడ్ అంటూ ఆదివారం సాయంత్రం ఆరుగంటల వరకు ఊదరగొట్టేసారు. 

Advertisement
CJ Advs

సోనాల్ చౌహన్ ఎంట్రీ, గురు ఫేమ్ రితిక సింగ్, శ్రద్ద కపూర్ ల డాన్స్ పెరఫార్మెన్స్ ఇవన్నీ బోర్ కొట్టేశాయి అంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు. నాగార్జున కూడా ఆడించిన ఆటలే.. ఆడించి ఆడించి చిరాకు పెట్టారు. హౌస్ మేట్స్ కూడా చెప్పినవే చెప్పి బోర్ కొట్టించేసేసారు. ఆరోహి రావు ఎలిమినేట్ అయిన విషయం కూడా ముందే లీక్ అవడం అనేది మరింత నీరసం తెప్పించేసింది. ఆమె ఎలిమినేట్ అయ్యి ఎవరి మీద ఎలాంటి కామెంట్స్ చెయ్యకుండా కామ్ గా స్టేజ్ దిగి వెళ్లిపోవడం కూడా అంతగా రుచించలేదు. ఫైనల్ గా దసరా ఎపిసోడ్ డల్ గా ముగిసింది.

Bigg Boss 6 Dussehra Special Full Episode:

Bigg Boss 6 Highlights Yesternight
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs