Advertisement
Google Ads BL

వరుడెవరో చెప్పమంటున్న అనన్య నాగళ్ళ


ఏ.. హీరోయిన్స్ పెళ్లి చేసుకోరా.. లైఫ్ లో సెటిల్ అవరా.. అంటే అవుతారు.. ఎందుకవరు. కాకపోతే ఆ బ్యూటీస్ తమ పెళ్లి విషయం స్వయంగా చెబితేనే దాన్ని నమ్మాలి లేదంటే.. అదో బిగ్గెస్ట్ రూమర్ గానే మిగిలిపోతుంది. ఇప్పుడు వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల పెళ్లి వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వకీల్ సాబ్, మల్లేశం ఇలా చిన్న పెద్ద చిత్రాల్లో అప్పుడప్పుడు మెరుస్తున్న అనన్య నాగళ్ళ రీసెంట్ గా సోషల్ మీడియా లో గ్లామర్ డోస్ పెంచింది. వరస ఫోటో షూట్స్ తో అందాలు ఆరబోస్తున్న అనన్య బిగ్ బాస్ ఫెమ్ సోహెల్ తో ఓ సినిమా చేస్తుంది. అలాగే తమిళంలోనూ నటిస్తుంది.

Advertisement
CJ Advs

కాకపోతే బిగ్ బ్రేక్ ఇచ్చే సినిమా ఆఫర్ కోసం బాగా వెయిట్ చేస్తుంది. ప్రస్తుతం అనన్య పెళ్లి చేసుకోబోతుంది. ఓ బడా నిర్మాత కొడుకుతో ఆమె త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది అంటూ ప్రచారం స్టార్ట్ అయ్యింది. తన పెళ్లి వార్తలపై అనన్య సెటేరికల్ గా స్పందించింది. అదేంటంటే నాకోసం పెళ్లి కొడుకును సెలెక్ట్ చేసిన వాళ్లకు థ్యాంక్స్. అయితే అతనెవరో అనేది కూడా చెప్పండి. అంతేకాదు మర్చిపోకుండా నా పెళ్లి డేట్, టైమ్ కూడా నాకు వివరించండి. అలా అయితేనే నా పెళ్లికి నేను రాగలను అంటూ ఫన్నీగా కాదు సెటైరికల్ గా ఆన్సర్ ఇచ్చి పెళ్లి వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టింది అనన్య.

Ananya Nagalla reacts on wedding rumors:

Vakeel Saab Movie Ananya Nagalla reacts on wedding rumors
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs