బాలీవుడ్ లో వరస పరాజయాలు అక్కడి ప్రముఖులకు కంటి మీద కునుకు రానివ్వడం లేదు. సౌత్ లో తెరకెక్కే పాన్ ఇండియా మూవీస్ తో కంపేర్ చేస్తూ నార్త్ సినిమాలని ఆడియన్స్ మెచ్చడం లేదు. సౌత్ లో తెరకెక్కే సినిమాలు హిందీలో ఇరగదీస్తున్నాయి. వీటి మీద పోటీకి విడుదలైన హిందీ సినిమాలు వరసగా ప్లాప్ అవుతూనే ఉన్నాయి. ప్రతి వారం కొత్త సినిమాల మీద ఆశ పెట్టుకోవడం.. అది కాస్త నిరాశగా మారడం అనేది ప్రస్తుతం అక్కడ రొటీన్ గా మారింది. బ్రహ్మాస్త్ర అయినా బాలీవుడ్ పరువు నిలబెడుతుంది అనుకుంటే.. దానికి డిసాస్టర్ టాక్ వచ్చేసింది.. ఎలాగోలా 100 కోట్ల మార్క్ ని దాటినా కానీ ఆ సినిమా కూడా బాలీవుడ్ లో పరిస్థితిని మెరుగుపరచలేకపోయింది.
ఇక లేటెస్ట్ గా విడుదలైన హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ల విక్రమ్ వేద అయినా.. బాలీవుడ్ కి ఊరటనిస్తోంది అనుకుంటే.. ఆ సినిమా కూడా నిరాశే పరిచింది. విక్రమ్ వేద కి ప్లాప్ టాక్ రావడం అటుంచి.. మొదటి రోజు సరైన ఓపెనింగ్స్ లేకపోవడం మరింత ఘోరమైన విషయం. హృతిక్ రోషన్-సైఫ్ అలీ ఖాన్ లు సాదా సీదా యాక్టర్స్ కాదు, పేరున్న క్రేజ్ ఉన్న యాక్టర్స్. అయినా విక్రమ్ వేదకి ఓపెనింగ్స్ లేవంటే.. బాలీవుడ్ లో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందొ అర్ధమవుతుంది. ఇక సోషల్ మీడియా నెగిటివిటీని తప్పించేందుకు, ఆడియన్స్ నుండి శెభాష్ అనిపించుకునే సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.